Parinaamulaaya naagu pamtamu leederenu

పరిణాములాయ నాకు పంతము లీడేరెను
Language

(॥పల్లవి॥)
పరిణాములాయ నాకు పంతము లీడేరెను
ఇరవై మా దీవెనలింకా నేలు సతుల

(॥పరి॥)
మొనసి నీతో సరసములాడఁగా నేఁడు నాకు
చనవిచ్చితివిగా సముకానను
మనసిచ్చి యప్పటిని మాటలాడేయట్టుగాను
ననుపు నటించి ఇట్టె నవ్వించితివిగా

(॥పరి॥)
సన్నసేసి ఇప్పుడు నీసంగడిఁ గూచుండే యట్టు
మన్నించితివిగా మక్కువతోను
వన్నెల నీతో నేను వాడిక నవ్వు నవ్వఁగా
యెన్నికఁగా బెద్దరికమిచ్చితివిగా

(॥పరి॥)
మేడలోన నన్నుఁ గూడి మేనరికపు వావులను
గూడి కెక్కించితివిగా వేడుకతోను
తోడనె శ్రీ వేంకటేశ దొరఁజేసి యిందరిలో
యీడేరించితివిగా యిన్నిటా నన్ను

(||pallavi||)
pariṇāmulāya nāgu paṁtamu līḍerĕnu
iravai mā dīvĕnaliṁkā nelu sadula

(||pari||)
mŏnasi nīdo sarasamulāḍam̐gā nem̐ḍu nāgu
sanavichchidivigā samugānanu
manasichchi yappaḍini māḍalāḍeyaṭṭugānu
nanubu naḍiṁchi iṭṭĕ navviṁchidivigā

(||pari||)
sannasesi ippuḍu nīsaṁgaḍim̐ gūsuṁḍe yaṭṭu
manniṁchidivigā makkuvadonu
vannĕla nīdo nenu vāḍiga navvu navvam̐gā
yĕnnigam̐gā bĕddarigamichchidivigā

(||pari||)
meḍalona nannum̐ gūḍi menarigabu vāvulanu
gūḍi kĕkkiṁchidivigā veḍugadonu
toḍanĕ śhrī veṁkaḍeśha dŏram̐jesi yiṁdarilo
yīḍeriṁchidivigā yinniḍā nannu