పరిపూర్ణుఁడవు నీకుఁ బరాకున్నదా నిన్ను
(॥పల్లవి॥)
పరిపూర్ణుఁడవు నీకుఁ బరాకున్నదా నిన్ను
మరిగి వుండనిదే మావల్లఁ దప్పు గాకా
(॥పని॥)
వినవా నీ వేమియైనా విశ్వమెల్లా వీనులే
యెనసి విన్నవించని యెడ్డతన మింతే కాక
కనవా నీ విన్నియు నీ కన్నులే యెందు చూచినా
పనితో నాభావము చూపని నేరమి గాకా
(॥పని॥)
పలుకవా నీ వేమియైనా బహుశబ్దమయుఁడవు
అలరి పిలువని నా యవివేక మింతే కాక
నిలువవా నా ముందర నిఖిలస్వరూపుఁడవు
తెలిసి చూడలేని సందేహ మింతేకాక
(॥పని॥)
మన్నించవా నీ వేమి మఱఁగు చొచ్చితి నంటే
పన్ని మత్తుఁడనై యున్న నా కర్మము గాక
యిన్నిట శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
యిన్నాళ్ళెఱుఁగని భాగ్యమి ట్టుండెఁ గాకా
(||pallavi||)
paribūrṇum̐ḍavu nīgum̐ barāgunnadā ninnu
marigi vuṁḍanide māvallam̐ dappu gāgā
(||pani||)
vinavā nī vemiyainā viśhvamĕllā vīnule
yĕnasi vinnaviṁchani yĕḍḍadana miṁte kāga
kanavā nī vinniyu nī kannule yĕṁdu sūsinā
panido nābhāvamu sūbani nerami gāgā
(||pani||)
palugavā nī vemiyainā bahuśhabdamayum̐ḍavu
alari piluvani nā yavivega miṁte kāga
niluvavā nā muṁdara nikhilasvarūbum̐ḍavu
tĕlisi sūḍaleni saṁdeha miṁtegāga
(||pani||)
manniṁchavā nī vemi maṟam̐gu sŏchchidi naṁṭe
panni mattum̐ḍanai yunna nā karmamu gāga
yinniḍa śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
yinnāḽḽĕṟum̐gani bhāgyami ṭṭuṁḍĕm̐ gāgā