Paramu verogasodam baamti yunnadaa

పరము వేరొకచోటఁ బాఁతి యున్నదా
Language

(॥పల్లవి॥)
పరము వేరొకచోటఁ బాఁతి యున్నదా
తిరమైన యీమాయ తెలియరు గాని

(॥పరము॥)
యెప్పుడు దేహాత్మ లెరవులుగాఁ జూచు
యెప్పు డహంకార మిటు మానును
అప్పుడు దైవము అఱచేతిలోనివాఁడు
కప్పినది కీలు గానరు గాని

(॥పరము॥)
యెన్నఁడు సమబుద్ధి నెందఱఁ దాఁ జూచు
నెన్నఁ డాసల మీఁదనిటు రోయును
అన్ని పుణ్యములు అండనే సమకూడు
యిన్నిటా నిది విచారించరు గాని

(॥పరము॥)
యెచ్చోట హరి భక్తి యిరవుగా మతి కబ్బు
యెచ్చోట సంశయ మిటు మానును
అచ్చోట శ్రీ వేంకటాద్రీశు కృప యుండు
మచ్చికె నిది గంటి మానరు గాని

(||pallavi||)
paramu verŏgasoḍam̐ bām̐ti yunnadā
tiramaina yīmāya tĕliyaru gāni

(||paramu||)
yĕppuḍu dehātma lĕravulugām̐ jūsu
yĕppu ḍahaṁkāra miḍu mānunu
appuḍu daivamu aṟasedilonivām̐ḍu
kappinadi kīlu gānaru gāni

(||paramu||)
yĕnnam̐ḍu samabuddhi nĕṁdaṟam̐ dām̐ jūsu
nĕnnam̐ ḍāsala mīm̐daniḍu royunu
anni puṇyamulu aṁḍane samagūḍu
yinniḍā nidi visāriṁcharu gāni

(||paramu||)
yĕchchoḍa hari bhakti yiravugā madi kabbu
yĕchchoḍa saṁśhaya miḍu mānunu
achchoḍa śhrī veṁkaḍādrīśhu kṛpa yuṁḍu
machchigĕ nidi gaṁṭi mānaru gāni