Paramaburusha nirubamaana sharanu sharanu re

పరమపురుష నిరుపమాన శరణు శరణు రే
Language

(॥పల్లవి॥)
పరమపురుష నిరుపమాన శరణు శరణు రే
యే యే యే యే ఇందిరా నిజమందిరా*

(॥పర॥)
కమలనాభ కమలనయన కమలచరణు రే
అమిత సురమునినాథయూధపనాయకా వరదాయకా

(॥పర॥)
చతురమూరితి చతురబాహుశంఖచక్రధరా
అతిశయ శ్రీవేంకటాధిప అంజనాకృతిరంజనా

(||pallavi||)
paramaburuṣha nirubamāna śharaṇu śharaṇu re
ye ye ye ye iṁdirā nijamaṁdirā*

(||para||)
kamalanābha kamalanayana kamalasaraṇu re
amida suramunināthayūdhabanāyagā varadāyagā

(||para||)
saduramūridi sadurabāhuśhaṁkhasakradharā
adiśhaya śhrīveṁkaḍādhiba aṁjanākṛtiraṁjanā