(॥పల్లవి॥)
పరమపాతకుఁడ భవబంధుఁడ శ్రీ -
హరి నినుఁ దలఁచ నే నరుహుఁడనా
(॥పరమ॥)
అపవిత్రుఁడ నే నమంగళుఁడఁ గడు-
నపగతణ్యుఁడ నలసుఁడను
కపటకలుషపరికరహృదయుఁడ నే-
నపవర్గమునకు నరుహుఁడనా
(॥పరమ॥)
అతిదుష్టుఁడ నే నధికదూషితుఁడ
హతవివేకమతి నదయుఁడను
పతిలేని రమాపతి మిముఁదలఁచలే
నతులగతికి నే నరుహుఁడనా
(॥పరమ॥)
అనుపమవిషయపరాధీనుఁడ నే-
ననంతమోహభయాతురుఁడ
వినుతింపఁగ దిరువేంకటేశ ఘను-
లనఘులుగాక నే నరుహుఁడనా
(||pallavi||)
paramabādagum̐ḍa bhavabaṁdhum̐ḍa śhrī -
hari ninum̐ dalam̐sa ne naruhum̐ḍanā
(||parama||)
abavitrum̐ḍa ne namaṁgaḽum̐ḍam̐ gaḍu-
nabagadaṇyum̐ḍa nalasum̐ḍanu
kabaḍagaluṣhabarigarahṛdayum̐ḍa ne-
nabavargamunagu naruhum̐ḍanā
(||parama||)
adiduṣhṭum̐ḍa ne nadhigadūṣhidum̐ḍa
hadavivegamadi nadayum̐ḍanu
padileni ramābadi mimum̐dalam̐sale
nadulagadigi ne naruhum̐ḍanā
(||parama||)
anubamaviṣhayabarādhīnum̐ḍa ne-
nanaṁtamohabhayādurum̐ḍa
vinudiṁpam̐ga diruveṁkaḍeśha ghanu-
lanaghulugāga ne naruhum̐ḍanā