పరమాత్ముఁడవు నీవు పరంజ్యోతివి నీవే
(॥పల్లవి॥)
పరమాత్ముఁడవు నీవు పరంజ్యోతివి నీవే
యిరవుగఁ గంటి వింటి నిదివో నీ రూపము
(॥పర॥)
పెక్కురోమకూపముల పెనుబ్రహ్మాండాలు మోచే
వెక్కసపు నీకుఁ ద్రివిక్రమాకృతి యేమి
అక్కడ వేదశ్రుతి ‘యత్యతిష్ఠద శాంగుల’
మెక్కువయని పొగడీ నిదివో నీరూపము
(॥పర॥)
వెడక జీవులలోనే వేవేలు రూపుల నీకు
యెదిటి దశావతారాలేమి యరుదు
అదె ‘విశ్వతోముఖ యనంతమూర్తి’వని
యిదె శ్రుతి వొగడీని యిదివో నీరూపము
(॥పర॥)
దిందుపడి సురలు నీతిరుమేనఁ బొడమఁగ
యిందరు నీవేయవుట యేమి యరుదు
యెందును శ్రీ వేంకటేశ ‘యేకో నారాయణ’
యిందులో శ్రుతి చాటీ నిదివో నీరూపము
(||pallavi||)
paramātmum̐ḍavu nīvu paraṁjyodivi nīve
yiravugam̐ gaṁṭi viṁṭi nidivo nī rūbamu
(||para||)
pĕkkuromagūbamula pĕnubrahmāṁḍālu mose
vĕkkasabu nīgum̐ drivikramākṛti yemi
akkaḍa vedaśhrudi ‘yatyadiṣhṭhada śhāṁgula’
mĕkkuvayani pŏgaḍī nidivo nīrūbamu
(||para||)
vĕḍaga jīvulalone vevelu rūbula nīgu
yĕdiḍi daśhāvadārālemi yarudu
adĕ ‘viśhvadomukha yanaṁtamūrdi’vani
yidĕ śhrudi vŏgaḍīni yidivo nīrūbamu
(||para||)
diṁdubaḍi suralu nīdirumenam̐ bŏḍamam̐ga
yiṁdaru nīveyavuḍa yemi yarudu
yĕṁdunu śhrī veṁkaḍeśha ‘yego nārāyaṇa’
yiṁdulo śhrudi sāḍī nidivo nīrūbamu