పరమాత్ముఁడవు నీవు పరతంత్రుఁడ నేను
(॥పల్లవి॥)
పరమాత్ముఁడవు నీవు పరతంత్రుఁడ నేను
హరి నీవు సర్వజ్ఞుఁడవు జ్ఞానము దెల్పవే
(॥పర॥)
సంతతము సర్వలోకసాక్షివి నీవు గనక
యెంతనే నెఱుఁగకున్నా నెఱిఁగింపవే
యింతటా నింద్రియముల నేలేవాఁడవు గనక
చెంతనే లోలుఁడనైనా చేరి బుద్ధి చెప్పవే
(॥పర॥)
జడియని బంధమోచనుఁడవు నీవు నే
విడువకున్నా మమత విడిపించవే
తడయక నీవే సూత్రధారివి గనక నే
నడుమఁ దెరువు దప్పినాఁ దప్ప నీకువే
(॥పర॥)
ఆని విశ్వలోచనుఁడ వైనాఁడవు గనక నేఁ
గానని యర్థము లెల్లాఁ గనిపించవే
జానుగ శ్రీవేంకటేశ జగత్కుటుంబివి గనక
నానావిధములను నన్నేలి పోషించవే
(||pallavi||)
paramātmum̐ḍavu nīvu paradaṁtrum̐ḍa nenu
hari nīvu sarvajñum̐ḍavu jñānamu dĕlbave
(||para||)
saṁtadamu sarvalogasākṣhivi nīvu ganaga
yĕṁtane nĕṟum̐gagunnā nĕṟim̐giṁpave
yiṁtaḍā niṁdriyamula nelevām̐ḍavu ganaga
sĕṁtane lolum̐ḍanainā seri buddhi sĕppave
(||para||)
jaḍiyani baṁdhamosanum̐ḍavu nīvu ne
viḍuvagunnā mamada viḍibiṁchave
taḍayaga nīve sūtradhārivi ganaga ne
naḍumam̐ dĕruvu dappinām̐ dappa nīguve
(||para||)
āni viśhvalosanum̐ḍa vainām̐ḍavu ganaga nem̐
gānani yardhamu lĕllām̐ ganibiṁchave
jānuga śhrīveṁkaḍeśha jagatkuḍuṁbivi ganaga
nānāvidhamulanu nanneli poṣhiṁchave