పరమాత్ముఁడైన హరి పట్టపురాణివి నీవు
(॥పల్లవి॥)
పరమాత్ముఁడైన హరి పట్టపురాణివి నీవు
ధర మమ్ము విచారించఁదగు నీకు నమ్మా
(॥పర॥)
కమలజుఁ గన్నతల్లి కామునిఁ గన్నతల్లి
అమరులఁ గన్నతల్లి ఆదిమలక్ష్మి
విమలపు నీపతికి విన్నపము నేసిమమ్ము
నెమకి యేలితి దయ నీకే తగునమ్మా
(॥పర॥)
కామధేను తోఁబుట్టుగ కల్పకము తోఁబుట్టుగ
దోమటి చల్లనిచంద్రుతోఁబుట్టుగ
నీమగనిపంపునను నిజసిరు లిచ్చితివి
నేనుపువితరణము నీకే తగునమ్మా
(॥పర॥)
పాలజలధికన్యవు పద్మాసనవి నీవు
పాలఁబండే శ్రీవేంకటపతిదేవివి
యేలిన యితనిబంట్ల కిహపరా లిచ్చి మా-
పాలఁ గలిగితివి సంబంధము మేలమ్మా
(||pallavi||)
paramātmum̐ḍaina hari paṭṭaburāṇivi nīvu
dhara mammu visāriṁcham̐dagu nīgu nammā
(||para||)
kamalajum̐ gannadalli kāmunim̐ gannadalli
amarulam̐ gannadalli ādimalakṣhmi
vimalabu nībadigi vinnabamu nesimammu
nĕmagi yelidi daya nīge tagunammā
(||para||)
kāmadhenu tom̐buṭṭuga kalbagamu tom̐buṭṭuga
domaḍi sallanisaṁdrudom̐buṭṭuga
nīmaganibaṁpunanu nijasiru lichchidivi
nenubuvidaraṇamu nīge tagunammā
(||para||)
pālajaladhiganyavu padmāsanavi nīvu
pālam̐baṁḍe śhrīveṁkaḍabadidevivi
yelina yidanibaṁṭla kihabarā lichchi mā-
pālam̐ galigidivi saṁbaṁdhamu melammā