పరమాత్ముఁ డొక్కఁడే పరమపావనుఁడు గన
(॥పల్లవి॥)
పరమాత్ముఁ డొక్కఁడే పరమపావనుఁడు గన
పరిపూర్ణుఁడనెడి యీభావమే చాలు
(॥పర॥)
హేయ మిందే దుపాధేయ మిందేది
బాయిటనే హరి సర్వపరిపూర్ణుఁడు
నేయునెడ గుణభావజీవకల్పనము లివి
రోయఁజూచినఁ దనదు కాయమే రోఁత
(॥పర॥)
జాతి యిందే దంత్యజాతి యిందేది
జాతులన్నిటా నాత్మ సర్వేశుఁడు
ఆతలను అంటుముట్టనెడి భావనలెల్ల
బాఁతిపడి యెఱఁగనోపని వెలితే తనది
(॥పర॥)
తెలివిగలదాఁకాఁ దెగని మఱఁగు లివి
తెలిసినంతటిమీఁదఁ దీరు సంశయము
యిలలోన శ్రీవేంకటేశ్వరుని కరుణచే
వెలసి యీజ్ఞానంబు విడువకు మనసా
(||pallavi||)
paramātmum̐ ḍŏkkam̐ḍe paramabāvanum̐ḍu gana
paribūrṇum̐ḍanĕḍi yībhāvame sālu
(||para||)
heya miṁde dubādheya miṁdedi
bāyiḍane hari sarvabaribūrṇum̐ḍu
neyunĕḍa guṇabhāvajīvagalbanamu livi
royam̐jūsinam̐ danadu kāyame rom̐ta
(||para||)
jādi yiṁde daṁtyajādi yiṁdedi
jādulanniḍā nātma sarveśhum̐ḍu
ādalanu aṁṭumuṭṭanĕḍi bhāvanalĕlla
bām̐tibaḍi yĕṟam̐ganobani vĕlide tanadi
(||para||)
tĕlivigaladām̐kām̐ dĕgani maṟam̐gu livi
tĕlisinaṁtaḍimīm̐dam̐ dīru saṁśhayamu
yilalona śhrīveṁkaḍeśhvaruni karuṇase
vĕlasi yījñānaṁbu viḍuvagu manasā