పరమ సుజ్ఞానులకు ప్రపన్నులకు
(॥పల్లవి॥)
పరమ సుజ్ఞానులకు ప్రపన్నులకు
మరుగురుని మీఁదట మనసుండవలదా
(॥పరమ॥)
ఆఁకలిగొన్నవానికి నన్నముపై నుండినట్టు
యేఁకట వుండవలదా యీశ్వరునిపై
కాఁకల విటులచూపు కాంతలపై నుండినట్టు
తేఁకువ నుండవలదా దేవునిమీఁదటను
(॥పరమ॥)
పసిబిడ్డలకు నాస పాలచంటిపై నున్నట్లు
కొసరే భక్తి వలదా గోవిందునిపై
వెసఁ దెరువరి తమి విడిదలపై నునట్టు
వసియించ వలదా శ్రీ వల్లభుమీఁదను
(॥పరమ॥)
నెప్పున ధనవంతుఁడు నిధి గాచియుండినట్టు
తప్పక శ్రీ వేంకటేశుఁ దగులవద్దా
అప్పసమైన భ్రమ ఆలజాలాలకున్నట్టు
యిప్పుడే వుండవలదా యీతని మీఁదనూ
(||pallavi||)
parama sujñānulagu prabannulagu
maruguruni mīm̐daḍa manasuṁḍavaladā
(||parama||)
ām̐kaligŏnnavānigi nannamubai nuṁḍinaṭṭu
yem̐kaḍa vuṁḍavaladā yīśhvarunibai
kām̐kala viḍulasūbu kāṁtalabai nuṁḍinaṭṭu
tem̐kuva nuṁḍavaladā devunimīm̐daḍanu
(||parama||)
pasibiḍḍalagu nāsa pālasaṁṭibai nunnaṭlu
kŏsare bhakti valadā goviṁdunibai
vĕsam̐ dĕruvari tami viḍidalabai nunaṭṭu
vasiyiṁcha valadā śhrī vallabhumīm̐danu
(||parama||)
nĕppuna dhanavaṁtum̐ḍu nidhi gāsiyuṁḍinaṭṭu
tappaga śhrī veṁkaḍeśhum̐ dagulavaddā
appasamaina bhrama ālajālālagunnaṭṭu
yippuḍe vuṁḍavaladā yīdani mīm̐danū