పరగ నిఁక నేఁటిది పనులు మంతుకు నెక్కె
(॥పల్లవి॥)
పరగ నిఁక నేఁటిది పనులు మంతుకు నెక్కె
కెరలించి వలపులు గిజిగిజి సేసెను
(॥॥)
గందము తాఁబూసుకొని కాంత నిన్నుఁ గాఁగిలించి
యిందరికి దనరతి యెఱిఁగించెను
సందడి చెమటలు పచ్చడానఁ దుడుచుకొని
పొందేటి సతులకుఁ జొప్పులుగాఁ దాఁ జేసెను
(॥॥)
వీడెపు మోవితోడ వేసరి చెక్కులంటించి
తోడివారి చిత్తాలకు దూరుసేసెను
వీడిన కొప్పు విరులు వెస నీపై విదిలించి
యీడఁ దనపతి వని యిక్కువలు సేసెను
(॥॥)
మచ్చిక నీతోఁ బెనఁగి మదనముద్ర లంటించి
రచ్చలఁ దన సొమ్మని రవ్వసేసెను
యిచ్చట శ్రీవేంకటేశ యిన్నిటా నిన్నఁగలసి
యిచ్చల నీవారికి మాకెఱుకగాఁ జేసెను
(||pallavi||)
paraga nim̐ka nem̐ṭidi panulu maṁtugu nĕkkĕ
kĕraliṁchi valabulu gijigiji sesĕnu
(||||)
gaṁdamu tām̐būsugŏni kāṁta ninnum̐ gām̐giliṁchi
yiṁdarigi danaradi yĕṟim̐giṁchĕnu
saṁdaḍi sĕmaḍalu pachchaḍānam̐ duḍusugŏni
pŏṁdeḍi sadulagum̐ jŏppulugām̐ dām̐ jesĕnu
(||||)
vīḍĕbu movidoḍa vesari sĕkkulaṁṭiṁchi
toḍivāri sittālagu dūrusesĕnu
vīḍina kŏppu virulu vĕsa nībai vidiliṁchi
yīḍam̐ danabadi vani yikkuvalu sesĕnu
(||||)
machchiga nīdom̐ bĕnam̐gi madanamudra laṁṭiṁchi
rachchalam̐ dana sŏmmani ravvasesĕnu
yichchaḍa śhrīveṁkaḍeśha yinniḍā ninnam̐galasi
yichchala nīvārigi māgĕṟugagām̐ jesĕnu