Paraga nem jesinatti bhaagyamu gaaga

పరగ నేఁ జేసినట్టి భాగ్యము గాక
Language

(॥పల్లవి॥)
పరగ నేఁ జేసినట్టి భాగ్యము గాక
సరస నీ దేవుళ్ల లో చక్కనిదాననా

(॥॥)
మన్నించి నీవు నను మాఁటలాడించేవు గాక
యెన్నిక నీ సతులలో నేమి బాఁతి
అన్నిటా నేరుపరివై యాదరించేవు గాక
కన్నెలు పదారువేలకంటె దొడ్డ దాననా

(॥॥)
యెల్లగా నాచే విడె మిప్పించుకొనేవు గాక
తొల్లిటి కాంతలకంటె దొరనా నేను
మెల్లనె నాచన్నుల మీఁదఁ జేయి వేసేవు గాక
గొల్లెతలకంటె నే నెక్కుడు దాననా

(॥॥)
ననుపునఁ గూడి నన్ను నవ్వు నవ్వించేవు గాక
చనవరి కాంతల సరివత్తునా
యెనసితివి శ్రీ వేంకటేశ నన్ను నింతలొనె
మనెడి వారికంటె మలసేటి దాననా

(||pallavi||)
paraga nem̐ jesinaṭṭi bhāgyamu gāga
sarasa nī devuḽla lo sakkanidānanā

(||||)
manniṁchi nīvu nanu mām̐ṭalāḍiṁchevu gāga
yĕnniga nī sadulalo nemi bām̐ti
anniḍā nerubarivai yādariṁchevu gāga
kannĕlu padāruvelagaṁṭĕ dŏḍḍa dānanā

(||||)
yĕllagā nāse viḍĕ mippiṁchugŏnevu gāga
tŏlliḍi kāṁtalagaṁṭĕ dŏranā nenu
mĕllanĕ nāsannula mīm̐dam̐ jeyi vesevu gāga
gŏllĕdalagaṁṭĕ ne nĕkkuḍu dānanā

(||||)
nanubunam̐ gūḍi nannu navvu navviṁchevu gāga
sanavari kāṁtala sarivattunā
yĕnasidivi śhrī veṁkaḍeśha nannu niṁtalŏnĕ
manĕḍi vārigaṁṭĕ malaseḍi dānanā