Paradeshibattanamuna paduguru negurum gooduga

పరదేశిపట్టణమున పదుగురు నేగురుఁ గూడుక
Language

(॥పల్లవి॥)
పరదేశిపట్టణమున పదుగురు నేగురుఁ గూడుక
పరగఁగ వరి చెడ నూదర బలిసినయట్లాయ

(॥పర॥)
ఊరేలెడియతఁ డలసత నూరకయుండఁగ నడుముల-
వారలు నిక్కపుగర్తలవలె నుండినగతిని
ధీరత చెడి తను జీవుఁడు దెలియఁగనేరక యుండిన
ధారుణిలోపల దొంగలధర్మాసనమాయ

(॥పర॥)
వొడలంతంతకుఁ జిక్కఁగ నుబ్బినరోగము సుఖమున-
కెడమియ్యక నానాఁటికి నేఁచిన చందమున
తడఁబడువిజ్ఞానము గతిదప్పఁగ బలుపగుపట్నము
కడుఁజెడఁగా, మాలవాడ ఘనమైనట్లాయ

(॥పర॥)
పొసఁగఁగ నిది గని యధికుడు పుక్కట కాండ్ల నందరిఁ
బసమారిచి మొదలికర్తఁ బాలించినగతిని
పసగలతిరువేంకటగిరిపతి నాదేహపుఁబురి నీ-
వసమై వెన్నకు బండ్లు వచ్చినయట్లాయ

(||pallavi||)
paradeśhibaṭṭaṇamuna paduguru negurum̐ gūḍuga
paragam̐ga vari sĕḍa nūdara balisinayaṭlāya

(||para||)
ūrelĕḍiyadam̐ ḍalasada nūragayuṁḍam̐ga naḍumula-
vāralu nikkabugardalavalĕ nuṁḍinagadini
dhīrada sĕḍi tanu jīvum̐ḍu dĕliyam̐ganeraga yuṁḍina
dhāruṇilobala dŏṁgaladharmāsanamāya

(||para||)
vŏḍalaṁtaṁtagum̐ jikkam̐ga nubbinarogamu sukhamuna-
kĕḍamiyyaga nānām̐ṭigi nem̐sina saṁdamuna
taḍam̐baḍuvijñānamu gadidappam̐ga balubagubaṭnamu
kaḍum̐jĕḍam̐gā, mālavāḍa ghanamainaṭlāya

(||para||)
pŏsam̐gam̐ga nidi gani yadhiguḍu pukkaḍa kāṁḍla naṁdarim̐
basamārisi mŏdaligardam̐ bāliṁchinagadini
pasagaladiruveṁkaḍagiribadi nādehabum̐buri nī-
vasamai vĕnnagu baṁḍlu vachchinayaṭlāya