పరతంత్రులు జీవులు బహుస్వతంత్రుఁడవు నీ
(॥పల్లవి॥)
పరతంత్రులు జీవులు బహుస్వతంత్రుఁడవు నీ
వరయ నీ కరుణే యటు మూలధనము
(॥పర॥)
కడు ననంతాయుష్యము గలిగినఁ గదా నీ దృష్టి
సుడిగొని వొక్కొక్కటె చూడవచ్చును
వడిఁ బెక్కుపాదములవాఁడైనఁ గదా నీ మూర్తి
చిడిముడిఁ బ్రదక్షిణఁ జేయవచ్చును
(॥పర॥)
కప్పి వేవేలు చేతులు గలిగినఁ గదా నిన్ను
నప్పసము పూజలు సేయఁగ వచ్చును
అప్పటి వేవేలు నోరులైనఁ గా మీగుణములు
కుప్పలుగా సారె సారెఁ గొనియాడవచ్చును
(॥పర॥)
యెదుట ననంతుఁడవు ఇటు నే నణుమాత్రము
యిదివో యెట్టు గూడీని యీ యర్థము
అదన నీవే యెఱిఁగి యనంతశక్తి నాకిచ్చి
చెదరక సేవగొను శ్రీవేంకటేశ
(||pallavi||)
paradaṁtrulu jīvulu bahusvadaṁtrum̐ḍavu nī
varaya nī karuṇe yaḍu mūladhanamu
(||para||)
kaḍu nanaṁtāyuṣhyamu galiginam̐ gadā nī dṛṣhṭi
suḍigŏni vŏkkŏkkaḍĕ sūḍavachchunu
vaḍim̐ bĕkkubādamulavām̐ḍainam̐ gadā nī mūrdi
siḍimuḍim̐ bradakṣhiṇam̐ jeyavachchunu
(||para||)
kappi vevelu sedulu galiginam̐ gadā ninnu
nappasamu pūjalu seyam̐ga vachchunu
appaḍi vevelu norulainam̐ gā mīguṇamulu
kuppalugā sārĕ sārĕm̐ gŏniyāḍavachchunu
(||para||)
yĕduḍa nanaṁtum̐ḍavu iḍu ne naṇumātramu
yidivo yĕṭṭu gūḍīni yī yardhamu
adana nīve yĕṟim̐gi yanaṁtaśhakti nāgichchi
sĕdaraga sevagŏnu śhrīveṁkaḍeśha