Paraagu seyaguramma padamtulaala

పరాకు సేయకురమ్మ పడఁతులాల
Language

(॥పల్లవి॥)
పరాకు సేయకురమ్మ పడఁతులాల
సరాగాన బాగాలీరే సతులకుఁ బతికి

(॥పరా॥)
మాటలఁ దేటలు చల్లి మగువలిద్దరిమీఁద
కూటువఁ బాదాలు చాఁచి కొలువున్నాఁడు
చాటుచు నవ్వులు నవ్వి సన్నలు కన్నులఁ జేసి
వేఁటలాడీ వలపు గోవిందరాజు లిదివో

(॥పరా॥)
వొత్తగిలి పానుపుపై నుంగరపు వేళ్లు చూపి
గుత్తపు గుబ్బలంటఁగఁ గోరుచున్నాఁడు
పొత్తుల మోవులు చూప పూవులవాట్లు వేసి
విత్తీఁ దమకము గోవిందరాజు లిదివో

(॥పరా॥)
లోననే యేపొద్దునుండి లోకమెల్లాఁ దెలుసుక
మానినులకాఁగిళ్ళ మరిగున్నాఁడు
నానిన చెమటాలతో నంటు శ్రీ వేంకటేశుఁడై
వీనులతో మాటాడీ గోవిందరాజు లిదివో

(||pallavi||)
parāgu seyaguramma paḍam̐tulāla
sarāgāna bāgālīre sadulagum̐ badigi

(||parā||)
māḍalam̐ deḍalu salli maguvaliddarimīm̐da
kūḍuvam̐ bādālu sām̐si kŏluvunnām̐ḍu
sāḍusu navvulu navvi sannalu kannulam̐ jesi
vem̐ṭalāḍī valabu goviṁdarāju lidivo

(||parā||)
vŏttagili pānububai nuṁgarabu veḽlu sūbi
guttabu gubbalaṁṭam̐gam̐ gorusunnām̐ḍu
pŏttula movulu sūba pūvulavāṭlu vesi
vittīm̐ damagamu goviṁdarāju lidivo

(||parā||)
lonane yebŏddunuṁḍi logamĕllām̐ dĕlusuga
māninulagām̐giḽḽa marigunnām̐ḍu
nānina sĕmaḍālado naṁṭu śhrī veṁkaḍeśhum̐ḍai
vīnulado māḍāḍī goviṁdarāju lidivo