Paraagu seyaga nannu bhaavimchi sittaanam bettu

పరాకు సేయక నన్ను భావించి చిత్తానఁ బెట్టు
Language

(॥పల్లవి॥)
పరాకు సేయక నన్ను భావించి చిత్తానఁ బెట్టు
సిరివంతుఁడు దీనుని జేరితేను రక్షించుఁ గదా

(॥పరాకు॥)
నాకూ వీఁడే యనక నాకేమి వచ్చీ ననక
దాకొని వీనివంటి దాసు లెంత లేదనకా
యీకడనే నెటువంటి హీనుఁడనైనా ఘనుఁడు
కైకొని మెట్టిన పాదుకలు సంరక్షణ సేయవలదా

(॥పరాకు॥)
నన్నుఁ దప్పులు వట్టక నాతోడ వేసరక
మన్నిఁచఁ గారణమేమి మఱి యింకా ననకా
కన్నులకుఁజూడ బాఁతిగా నీవాఁడ నైనాను
పన్నిన జూదరిసారె పదిలముగాను దాఁచఁడా

(॥పరాకు॥)
నావోజ చూడక నగుఁబాట్లు సేయక
వేవేలై నానా నేరాలు విచారించకా
శ్రీవేంకటేశ నీకు సేవ సేయకుండినాను
దేవర పూజారితప్పు దేరుచఁడా మొక్కితేను

(||pallavi||)
parāgu seyaga nannu bhāviṁchi sittānam̐ bĕṭṭu
sirivaṁtum̐ḍu dīnuni jeridenu rakṣhiṁchum̐ gadā

(||parāgu||)
nāgū vīm̐ḍe yanaga nāgemi vachchī nanaga
dāgŏni vīnivaṁṭi dāsu lĕṁta ledanagā
yīgaḍane nĕḍuvaṁṭi hīnum̐ḍanainā ghanum̐ḍu
kaigŏni mĕṭṭina pādugalu saṁrakṣhaṇa seyavaladā

(||parāgu||)
nannum̐ dappulu vaṭṭaga nādoḍa vesaraga
mannim̐sam̐ gāraṇamemi maṟi yiṁkā nanagā
kannulagum̐jūḍa bām̐tigā nīvām̐ḍa nainānu
pannina jūdarisārĕ padilamugānu dām̐sam̐ḍā

(||parāgu||)
nāvoja sūḍaga nagum̐bāṭlu seyaga
vevelai nānā nerālu visāriṁchagā
śhrīveṁkaḍeśha nīgu seva seyaguṁḍinānu
devara pūjāridappu derusam̐ḍā mŏkkidenu