(॥పల్లవి॥)
పనిగల దింకాఁ బదరకువే
ఘనుఁ డాతనిగతి గందముగాని
(॥పని॥)
మనసున నొకటియు మాటల నొకటియు
ననుపున రెండును నడపకువే
మునుపటికోపము మొక్కినఁ బోయీ
తినఁదిన వేములు దీపులెకావా
(॥పని॥)
దవ్వులఁ గపటము దగ్గరినఁ గూట-
మివ్వల నవ్వల నెంచకువే
నవ్వులపోట్లు నమ్మికఁ బాసీ
పువ్వఁగఁ బువ్వఁగ బూఁపలెకావా
(॥పని॥)
సిగ్గుల మొరఁగులు చింతలవెరగులు
యెగ్గులు యేతులు యిఁకనేలే
యిగ్గతి శ్రీవేంకటేశుఁడు గూడెను
నిగ్గులయద్దము నీడకేకాదా
(||pallavi||)
panigala diṁkām̐ badaraguve
ghanum̐ ḍādanigadi gaṁdamugāni
(||pani||)
manasuna nŏgaḍiyu māḍala nŏgaḍiyu
nanubuna rĕṁḍunu naḍabaguve
munubaḍigobamu mŏkkinam̐ boyī
tinam̐dina vemulu dībulĕgāvā
(||pani||)
davvulam̐ gabaḍamu daggarinam̐ gūḍa-
mivvala navvala nĕṁchaguve
navvulaboṭlu nammigam̐ bāsī
puvvam̐gam̐ buvvam̐ga būm̐palĕgāvā
(||pani||)
siggula mŏram̐gulu siṁtalavĕragulu
yĕggulu yedulu yim̐kanele
yiggadi śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕnu
niggulayaddamu nīḍagegādā