పని లేదు పాట లేదు భ్రమించి వీఁడు మా
(॥పల్లవి॥)
పని లేదు పాట లేదు భ్రమించి వీఁడు మా
మనసెల్ల దక్కఁగొనె మాధవ గోవిందుఁడూ
(॥పని॥)
పూచిన మానికింద పోఁటి వెట్టుక తా నుండీ
యేచి పిల్లంగోవి యూదీ యేఁటికే వీఁడు
తాచి తన రాగాలకు తానే చొక్కి రేపల్లె
చూచి చూచి బొమ్మలార్చి చూడవే వీఁడు
(॥పని॥)
కాలిపై గాలు వేసి కడు మువ్వంక నొరఁగి
వేలివుంగరాలు చూపీ వేసాల వీఁడు
నీలమేఘపు వర్ణుఁడై నెమలిచుంగులపాగ
తూలియాడఁ దల వూచీ దొడ్డవాఁడే వీఁడు
(॥పని॥)
పీతాంబరము గట్టి పెను సొమ్ము లెల్లఁ బెట్టి
చేతుల శంఖుచక్రాల చెలఁగీ వీఁడు
యీతల శ్రీవేంకటేశుఁ డిందరి కిన్ని రూపు
కాతరానఁ గూడీవాఁడు గబ్బిగదె వీఁడు
(||pallavi||)
pani ledu pāḍa ledu bhramiṁchi vīm̐ḍu mā
manasĕlla dakkam̐gŏnĕ mādhava goviṁdum̐ḍū
(||pani||)
pūsina mānigiṁda pom̐ṭi vĕṭṭuga tā nuṁḍī
yesi pillaṁgovi yūdī yem̐ṭige vīm̐ḍu
tāsi tana rāgālagu tāne sŏkki reballĕ
sūsi sūsi bŏmmalārsi sūḍave vīm̐ḍu
(||pani||)
kālibai gālu vesi kaḍu muvvaṁka nŏram̐gi
velivuṁgarālu sūbī vesāla vīm̐ḍu
nīlameghabu varṇum̐ḍai nĕmalisuṁgulabāga
tūliyāḍam̐ dala vūsī dŏḍḍavām̐ḍe vīm̐ḍu
(||pani||)
pīdāṁbaramu gaṭṭi pĕnu sŏmmu lĕllam̐ bĕṭṭi
sedula śhaṁkhusakrāla sĕlam̐gī vīm̐ḍu
yīdala śhrīveṁkaḍeśhum̐ ḍiṁdari kinni rūbu
kādarānam̐ gūḍīvām̐ḍu gabbigadĕ vīm̐ḍu