Pani galappudu vachchi paligem gaani

పని గలప్పుడు వచ్చి పలికేఁ గాని
Language

(॥పల్లవి॥)
పని గలప్పుడు వచ్చి పలికేఁ గాని
వొనరి నీ యింటిలోనె వుండేరా నేను

(॥పని గల॥)
చిత్తము వచ్చినవేళ చేర వచ్చేఁ గాని నేను
అత్తి యందాఁక లోని కంపరా నన్ను
కత్తిఁ గోసిన ట్టయీఁ గడు నీమాఁటలు వింటే
వొత్తిలి దవ్వుల నైన వుండేరా నేను

(॥పని గల॥)
నిక్కెము నే నాల నై నీతో నవ్వేఁ గాని
యిక్కువఁ దలవంచుకో నియ్యరా నన్ను
ముక్కు వట్టినట్లయినా మోహము నీవు చల్లితే
వొక్క నీసేవ సేసుక వుండేరా నేను

(॥పని గల॥)
వలసినప్పుడె నీవద్ద గూచుండేఁ గాని
యిల నందాఁక నలుగు నియ్యరా నన్ను
బలిమి శ్రీవెంకటేశ పట్టి నన్నుఁ గూడితివి
వొలిసే నీతలఁపులోన వుండేరా నేను

(||pallavi||)
pani galappuḍu vachchi paligem̐ gāni
vŏnari nī yiṁṭilonĕ vuṁḍerā nenu

(||pani gala||)
sittamu vachchinaveḽa sera vachchem̐ gāni nenu
atti yaṁdām̐ka loni kaṁparā nannu
kattim̐ gosina ṭṭayīm̐ gaḍu nīmām̐ṭalu viṁṭe
vŏttili davvula naina vuṁḍerā nenu

(||pani gala||)
nikkĕmu ne nāla nai nīdo navvem̐ gāni
yikkuvam̐ dalavaṁchugo niyyarā nannu
mukku vaṭṭinaṭlayinā mohamu nīvu sallide
vŏkka nīseva sesuga vuṁḍerā nenu

(||pani gala||)
valasinappuḍĕ nīvadda gūsuṁḍem̐ gāni
yila naṁdām̐ka nalugu niyyarā nannu
balimi śhrīvĕṁkaḍeśha paṭṭi nannum̐ gūḍidivi
vŏlise nīdalam̐pulona vuṁḍerā nenu