Pamtamule nerabevu palumaarunu

పంతములే నెరపేవు పలుమారును
Language

(॥పల్లవి॥)
పంతములే నెరపేవు పలుమారును
యెంత కెంత విచారించ కిది నీకుఁ దగునా

(॥పంతములే॥)
వీడ నాడేవు విభుని వీసమంత పని కైన
తోడనె కొండవంటి దొర గాఁడా
యేడ నైనా నీ వైతే నెకసక్కెమే సేసేవు
జాడతో నీచే నాతఁడు సాదింపఁబడునా

(॥పంతములే॥)
చెలరేఁగే వది యేమే చేతికి లోనాయ నంటా
వలపు నీమీఁదఁ గలవాఁడు గాఁడా
సొలసి సొలసి వోరచూపుల జూచే వదేమే
చలపాదితన మింత సతులకుఁ చెల్లునా

(॥పంతములే॥)
సిగ్గువడే విది యేమే చేయ నీపై వేసె నంటా
యెగ్గు లేని శ్రీవెంకటేశుఁడు గాడా
అగ్గ మై నీచిత్తము రా నన్నిట నాతఁడు గూడె
కగ్గ దేరినందుమీఁదఁ గపటము చెల్లునా

(||pallavi||)
paṁtamule nĕrabevu palumārunu
yĕṁta kĕṁta visāriṁcha kidi nīgum̐ dagunā

(||paṁtamule||)
vīḍa nāḍevu vibhuni vīsamaṁta pani kaina
toḍanĕ kŏṁḍavaṁṭi dŏra gām̐ḍā
yeḍa nainā nī vaide nĕgasakkĕme sesevu
jāḍado nīse nādam̐ḍu sādiṁpam̐baḍunā

(||paṁtamule||)
sĕlarem̐ge vadi yeme sedigi lonāya naṁṭā
valabu nīmīm̐dam̐ galavām̐ḍu gām̐ḍā
sŏlasi sŏlasi vorasūbula jūse vademe
salabādidana miṁta sadulagum̐ sĕllunā

(||paṁtamule||)
sigguvaḍe vidi yeme seya nībai vesĕ naṁṭā
yĕggu leni śhrīvĕṁkaḍeśhum̐ḍu gāḍā
agga mai nīsittamu rā nanniḍa nādam̐ḍu gūḍĕ
kagga derinaṁdumīm̐dam̐ gabaḍamu sĕllunā