Pamtamudoduda meṟasee nidivo prakrtimoolamai yee samsaaramu

పంతముతోడుత మెఱసీ నిదివో ప్రకృతిమూలమై యీ సంసారము
Language

(॥పల్లవి॥)
పంతముతోడుత మెఱసీ నిదివో ప్రకృతిమూలమై యీ సంసారము
యెంతటివారము నేమిటి గెలువఁగ యీశ్వరుఁడే దయఁ జూచీఁ గాక

(॥పంత॥)
అనాదికాల ప్రవాహము అఖిలజీవులకు యీ సంసారము
వినోదమై జరుగుచున్న దిదె విష్ణులీలయై యీ సంసారము
పనివడి యప్పుడు కల్పకల్పమున బ్రహ్మసృష్టియగు యీసంసారము
పెనగొని పలు చుట్టరికంబులతోఁ బెరుగుచు నుండును సంసారము

(॥పంత॥)
మాయలకెల్లను వునికిపట్టగుచు మరిగించీనిదె యీసంసారము
కాయజుచేతను నానావికార కల్పితమైనది యీ సంసారము
పాయము ముదిసినఁ బోనీక సంతానపరంపరైనది యీ సంసారము
మోయనిమోపై అంటుకొన్నదిదెముందు వెనకలను యీ సంసారము

(॥పంత॥)
చిమ్మి రేఁగుచునుఁ బురాకృతంబునఁ జిగిరి చీనిదె యీ సంసారము
తెమ్మలుగా ముందరి కోరికెలను తీగెలు వారీ నీ సంసారము
పమ్మి యింతలోనలమేల్మంగకు పతియగు శ్రీవేంకటేశ్వరుకరుణను
నెమ్మది నితని దాసునిఁగాఁ జేసి నెరవేరిచే నీ సంసారము

(||pallavi||)
paṁtamudoḍuda mĕṟasī nidivo prakṛtimūlamai yī saṁsāramu
yĕṁtaḍivāramu nemiḍi gĕluvam̐ga yīśhvarum̐ḍe dayam̐ jūsīm̐ gāga

(||paṁta||)
anādigāla pravāhamu akhilajīvulagu yī saṁsāramu
vinodamai jarugusunna didĕ viṣhṇulīlayai yī saṁsāramu
panivaḍi yappuḍu kalbagalbamuna brahmasṛṣhṭiyagu yīsaṁsāramu
pĕnagŏni palu suṭṭarigaṁbuladom̐ bĕrugusu nuṁḍunu saṁsāramu

(||paṁta||)
māyalagĕllanu vunigibaṭṭagusu marigiṁchīnidĕ yīsaṁsāramu
kāyajusedanu nānāvigāra kalbidamainadi yī saṁsāramu
pāyamu mudisinam̐ bonīga saṁtānabaraṁparainadi yī saṁsāramu
moyanimobai aṁṭugŏnnadidĕmuṁdu vĕnagalanu yī saṁsāramu

(||paṁta||)
simmi rem̐gusunum̐ burākṛtaṁbunam̐ jigiri sīnidĕ yī saṁsāramu
tĕmmalugā muṁdari korigĕlanu tīgĕlu vārī nī saṁsāramu
pammi yiṁtalonalamelmaṁgagu padiyagu śhrīveṁkaḍeśhvarugaruṇanu
nĕmmadi nidani dāsunim̐gām̐ jesi nĕraverise nī saṁsāramu