పంతము చెల్లెను నీకు పదర నేలే
(॥పల్లవి॥)
పంతము చెల్లెను నీకు పదర నేలే
చింత దీర పతిమాట చేకొందు గాక
(॥పంతము॥)
అలిగినరమణుఁడె అట్టె నిన్నుఁ బేరుకొని
పిలిచినమీఁద నింక బిగు వేఁటికే
తల వంచు కుండఁగాను తగ నీపైఁ జేయి వేసి
కలయఁగ నీలోని కపటము లేఁటికే
(॥పంతము॥)
చేసన్నల రానివాఁడె చెట్ట వట్టి తియ్యఁగాను
వాసుల వంతులతోడి వాదు లేఁటికే
ఆసల నీ వద్దనుండి అట్టె తానె ఆన వెట్టి
సేస చల్లే పతిమీఁద చిడుముడి యేలే
(॥పంతము॥)
యింటికి రానట్టివాఁడె యిటు నిన్ను వేఁడుకొని
వెంట వెంట రాఁగానె వేస టేఁటికే
అంటుక శ్రీవెంకటేశుఁ డాతఁడె నిన్ను గూడె
జంటయి వుందురు గాక చల మింకా నేలే
(||pallavi||)
paṁtamu sĕllĕnu nīgu padara nele
siṁta dīra padimāḍa segŏṁdu gāga
(||paṁtamu||)
aliginaramaṇum̐ḍĕ aṭṭĕ ninnum̐ berugŏni
pilisinamīm̐da niṁka bigu vem̐ṭige
tala vaṁchu kuṁḍam̐gānu taga nībaim̐ jeyi vesi
kalayam̐ga nīloni kabaḍamu lem̐ṭige
(||paṁtamu||)
sesannala rānivām̐ḍĕ sĕṭṭa vaṭṭi tiyyam̐gānu
vāsula vaṁtuladoḍi vādu lem̐ṭige
āsala nī vaddanuṁḍi aṭṭĕ tānĕ āna vĕṭṭi
sesa salle padimīm̐da siḍumuḍi yele
(||paṁtamu||)
yiṁṭigi rānaṭṭivām̐ḍĕ yiḍu ninnu vem̐ḍugŏni
vĕṁṭa vĕṁṭa rām̐gānĕ vesa ṭem̐ṭige
aṁṭuga śhrīvĕṁkaḍeśhum̐ ḍādam̐ḍĕ ninnu gūḍĕ
jaṁṭayi vuṁduru gāga sala miṁkā nele