Pamtamu sellenu badam gadaraa

పంతము చెల్లెను బదఁ గదరా
Language

(॥పల్లవి॥)
పంతము చెల్లెను బదఁ గదరా
యింతలోనఁ దప్పు లెంచక పదరా

(॥పంతము॥)
రాని కోపమున రవ్వ సేసితి నింతే
పానుపు మీఁదికిఁ బదఁ గదరా
సోనలచెమటల సొలసితి నింతే
తేనెమోవి దప్పి దేర్చేఁ బదరా

(॥పంతము॥)
అనుమానానీకు నలిగితి నింతే
పని గల దిక నటు పదఁ గదరా
నను నిటు చూడఁగ నవ్వితి నింతే
తనిపే నీమతి తావుకుఁ బదరా

(॥పంతము॥)
పాసిన కాఁకల బలికితి నింతే
బాసలు నమ్మితిఁ బద గదరా
ఆసల శ్రీవేంకటాధిప కూడితి
వేసారపురతి వెనకకుఁ బదరా

(||pallavi||)
paṁtamu sĕllĕnu badam̐ gadarā
yiṁtalonam̐ dappu lĕṁchaga padarā

(||paṁtamu||)
rāni kobamuna ravva sesidi niṁte
pānubu mīm̐digim̐ badam̐ gadarā
sonalasĕmaḍala sŏlasidi niṁte
tenĕmovi dappi dersem̐ badarā

(||paṁtamu||)
anumānānīgu naligidi niṁte
pani gala diga naḍu padam̐ gadarā
nanu niḍu sūḍam̐ga navvidi niṁte
tanibe nīmadi tāvugum̐ badarā

(||paṁtamu||)
pāsina kām̐kala baligidi niṁte
bāsalu nammidim̐ bada gadarā
āsala śhrīveṁkaḍādhiba kūḍidi
vesāraburadi vĕnagagum̐ badarā