Pamtamu paadiyu neebhaavamulone kamti

పంతము పాడియు నీభావములోనే కంటి
Language

(॥పల్లవి॥)
పంతము పాడియు నీభావములోనే కంటి
యెంత ప్రియముచెప్పినా నిది మెచ్చుగాదురా

(॥॥)
చిత్తములో తమకము చిఱుఁజెమటలఁ గంటి
కొత్తకొత్తనీపొందులు కొప్పుపువ్వులనే కంటి
తత్తరపునీగుణాలు తనుపులకలఁ గంటి
రుత్తమాట లేమన్నా రుచిగావు మానరా

(॥॥)
కాఁకల నీవసివాడు కనుచూపులనే కంటి
వేఁకపునీయలపెల్లా వెడనిట్టూర్పులఁ గంటి
సోఁకుల నీవేడుకలు సొంపుఁ గళలనే కంటి
వూఁకొనేఁగాని నీసుద్దు లొడఁబాటు గావురా

(॥॥)
నాటకపునీవిద్దె నగవులలోఁ గంటి
గాఁటపు నీవలపెల్లా కాఁగిటిలోన కంటి
పాటించి శ్రీ వేంకటేశ పై కొని నన్నుఁ గూడితి-
విటు రాఁదొల్లిటివలె నిందులోఁ జెల్లదురా

(||pallavi||)
paṁtamu pāḍiyu nībhāvamulone kaṁṭi
yĕṁta priyamusĕppinā nidi mĕchchugādurā

(||||)
sittamulo tamagamu siṟum̐jĕmaḍalam̐ gaṁṭi
kŏttagŏttanībŏṁdulu kŏppubuvvulane kaṁṭi
tattarabunīguṇālu tanubulagalam̐ gaṁṭi
ruttamāḍa lemannā rusigāvu mānarā

(||||)
kām̐kala nīvasivāḍu kanusūbulane kaṁṭi
vem̐kabunīyalabĕllā vĕḍaniṭṭūrbulam̐ gaṁṭi
som̐kula nīveḍugalu sŏṁpum̐ gaḽalane kaṁṭi
vūm̐kŏnem̐gāni nīsuddu lŏḍam̐bāḍu gāvurā

(||||)
nāḍagabunīviddĕ nagavulalom̐ gaṁṭi
gām̐ṭabu nīvalabĕllā kām̐giḍilona kaṁṭi
pāḍiṁchi śhrī veṁkaḍeśha pai kŏni nannum̐ gūḍidi-
viḍu rām̐dŏlliḍivalĕ niṁdulom̐ jĕlladurā