Pamtamu neraba vachchi palasanaidivi neevu

పంతము నెరప వచ్చి పలచనైతివి నీవు
Language

(॥పల్లవి॥)
పంతము నెరప వచ్చి పలచనైతివి నీవు
దొంతి వలపులలోని దొమ్మిఁ జిక్కవు గదా

(॥పంత॥)
కోపగించి చూడఁ బోయి కొనలు సాగ నవ్వితి-
వేపనికో కాని నేనెరఁగ లేదా
చేపట్టి నేఁ దియ్యఁబోతేఁ జేతిగోరు దాఁకెనింతే
యేపుననాయముచోటు యిదె కాదు గదా

(॥పంత॥)
చలము సాదించ వచ్చి చనవు చేసుకొనేవు
తలఁపిది యేఁటిదో తడవలేరా
చెలఁగి పైనొరగితే చెమట మైసోఁకెనింతె
యెలమి నీవొడలిట్టె యెంగిలిగాదు గదా

(॥పంత॥)
కడు సూడుకుఁ బెనఁగి కన్నులు మూసుకొనేవు
తొడరి నీకరుణకుఁ దుదలేదురా
విడువక యిదివో శ్రీవేంకటేశ కూడితివి
బడిబడినిదె నీకు బలువుగాదు గదా

(||pallavi||)
paṁtamu nĕraba vachchi palasanaidivi nīvu
dŏṁti valabulaloni dŏmmim̐ jikkavu gadā

(||paṁta||)
kobagiṁchi sūḍam̐ boyi kŏnalu sāga navvidi-
vebanigo kāni nenĕram̐ga ledā
sebaṭṭi nem̐ diyyam̐bodem̐ jedigoru dām̐kĕniṁte
yebunanāyamusoḍu yidĕ kādu gadā

(||paṁta||)
salamu sādiṁcha vachchi sanavu sesugŏnevu
talam̐pidi yem̐ṭido taḍavalerā
sĕlam̐gi painŏragide sĕmaḍa maisom̐kĕniṁtĕ
yĕlami nīvŏḍaliṭṭĕ yĕṁgiligādu gadā

(||paṁta||)
kaḍu sūḍugum̐ bĕnam̐gi kannulu mūsugŏnevu
tŏḍari nīgaruṇagum̐ dudaledurā
viḍuvaga yidivo śhrīveṁkaḍeśha kūḍidivi
baḍibaḍinidĕ nīgu baluvugādu gadā