Pamtamu neegum dagadu padamtidonu

పంతము నీకుఁ దగదు పడఁతితోను
Language

(॥పల్లవి॥)
పంతము నీకుఁ దగదు పడఁతితోను
చింతలకు బనిలేదు చిక్కులెల్లాఁ బాసెను

(॥పంత॥)
మొగము చూచి చెలి మోనమున దలవంచె
నగవురాగా నణఁచి నాలిసేసెను
తగిలి యింతటఁబోయి దగ్గర గూచుండవయ్య
అగపడి నిన్ను మెచ్చీ నలుకెల్లాఁ దీరెను

(॥పంత॥)
వలపు నీపై జల్లి వాసులువట్టుక చెలి
పలుకఁబోయి మాని పరాకైనది
చెలఁగి యింతటబోయి చెక్కులిట్టె నొక్కవయ్య
చలములెల్లా విగిచి సమ్మతించు నీకును

(॥పంత॥)
బొమ్మలజంకెన చూచి వూఁచి చూపి సిగ్గుపడి
తమ్ములపు మోవి చేత దాఁచి మూసెను
యిమ్ముల శ్రీవేంకటేశ యింతలో గూడితివయ్య
నెమ్మనము నీకునిచ్చి నివ్వెరగుఁ బొందెను

(||pallavi||)
paṁtamu nīgum̐ dagadu paḍam̐tidonu
siṁtalagu baniledu sikkulĕllām̐ bāsĕnu

(||paṁta||)
mŏgamu sūsi sĕli monamuna dalavaṁchĕ
nagavurāgā naṇam̐si nālisesĕnu
tagili yiṁtaḍam̐boyi daggara gūsuṁḍavayya
agabaḍi ninnu mĕchchī nalugĕllām̐ dīrĕnu

(||paṁta||)
valabu nībai jalli vāsuluvaṭṭuga sĕli
palugam̐boyi māni parāgainadi
sĕlam̐gi yiṁtaḍaboyi sĕkkuliṭṭĕ nŏkkavayya
salamulĕllā vigisi sammadiṁchu nīgunu

(||paṁta||)
bŏmmalajaṁkĕna sūsi vūm̐si sūbi siggubaḍi
tammulabu movi seda dām̐si mūsĕnu
yimmula śhrīveṁkaḍeśha yiṁtalo gūḍidivayya
nĕmmanamu nīgunichchi nivvĕragum̐ bŏṁdĕnu