పంతము నీ కిదె వచ్చె పరవశములు హెచ్చె
(॥పల్లవి॥)
పంతము నీ కిదె వచ్చె పరవశములు హెచ్చె
ఇంతటనైన మాట లియ్యకొనరాదా
(॥పంత॥)
చెలిమోవిఁ దేనె లూరె చెమటలు మేనఁ గారె
చలము లింతటనైనఁ జాలించరాదా
సెలవి నవ్వులు చిందె సిగ్గులు చేతికి నందె
అలివేణి నిఁకనైన నాదరించరాదా
(॥పంత॥)
నిట్టూర్పు లివె మించె నివ్వెర కన్నులఁ బెంచె
వట్టిజాలి యిఁకనేల వరు సీరాదా
మట్టుమీరెఁ దలపోఁత మానిని వలపు యీఁత
యిట్టె విచ్చేసి యింతి నిఁకఁ జేకోరాదా
(॥పంత॥)
పున్నమకళలు నిండె పులకపంటలు పండె
మన్నించి వనితతోడ మాటడరాదా
వున్నతి శ్రీవేంకటేశ వొక్కటైతి వీకెతోడ
యిన్నిటా యేకచిత్తాన యిఁక నుండరాదా
(||pallavi||)
paṁtamu nī kidĕ vachchĕ paravaśhamulu hĕchchĕ
iṁtaḍanaina māḍa liyyagŏnarādā
(||paṁta||)
sĕlimovim̐ denĕ lūrĕ sĕmaḍalu menam̐ gārĕ
salamu liṁtaḍanainam̐ jāliṁcharādā
sĕlavi navvulu siṁdĕ siggulu sedigi naṁdĕ
aliveṇi nim̐kanaina nādariṁcharādā
(||paṁta||)
niṭṭūrbu livĕ miṁchĕ nivvĕra kannulam̐ bĕṁchĕ
vaṭṭijāli yim̐kanela varu sīrādā
maṭṭumīrĕm̐ dalabom̐ta mānini valabu yīm̐ta
yiṭṭĕ vichchesi yiṁti nim̐kam̐ jegorādā
(||paṁta||)
punnamagaḽalu niṁḍĕ pulagabaṁṭalu paṁḍĕ
manniṁchi vanidadoḍa māḍaḍarādā
vunnadi śhrīveṁkaḍeśha vŏkkaḍaidi vīgĕdoḍa
yinniḍā yegasittāna yim̐ka nuṁḍarādā