Pamtamu laadam jelladu padulagu sadulagu

పంతము లాడఁ జెల్లదు పతులకు సతులకు
Language

(॥పల్లవి॥)
పంతము లాడఁ జెల్లదు పతులకు సతులకు
ఇంతయుఁ దెలిపి పతి నింటికి రమ్మనవే

(॥॥)
ఆడుకోలు మాటలు ఆయములు గరఁగించు
యీడైన వయసులు యేఁకరింపించు
చూడఁ జూడ చూపులు చుట్టరికములు సేసు
వేడుకైన సరసాలు వియ్య మందింపించును

(॥॥)
తనివోని వినుకులు తలపోఁతలు రేఁచు
బెనకుల చేఁతలు సిగ్గులు నించు
పెనగొన్న కోరికలు ప్రియములు చెప్పించు
పసు పడ్డ నవ్వులు బయలిఁ దెప్పించును

(॥॥)
వుడివోని మోవిపండు వూరకే నోరూరింపించు
అడియాలపు రతు లాస లెక్కించు
బడి నలమేలు మంగపతి శ్రీ వేంకటేశుఁడు
విడువక నన్నుఁ గూడి వేడుక వుట్టించును

(||pallavi||)
paṁtamu lāḍam̐ jĕlladu padulagu sadulagu
iṁtayum̐ dĕlibi padi niṁṭigi rammanave

(||||)
āḍugolu māḍalu āyamulu garam̐giṁchu
yīḍaina vayasulu yem̐kariṁpiṁchu
sūḍam̐ jūḍa sūbulu suṭṭarigamulu sesu
veḍugaina sarasālu viyya maṁdiṁpiṁchunu

(||||)
tanivoni vinugulu talabom̐talu rem̐su
bĕnagula sem̐talu siggulu niṁchu
pĕnagŏnna korigalu priyamulu sĕppiṁchu
pasu paḍḍa navvulu bayalim̐ dĕppiṁchunu

(||||)
vuḍivoni movibaṁḍu vūrage norūriṁpiṁchu
aḍiyālabu radu lāsa lĕkkiṁchu
baḍi nalamelu maṁgabadi śhrī veṁkaḍeśhum̐ḍu
viḍuvaga nannum̐ gūḍi veḍuga vuṭṭiṁchunu