పంతము దప్పదు నీకుఁ బడఁతితోను
(॥పల్లవి॥)
పంతము దప్పదు నీకుఁ బడఁతితోను
యింతటిలోనే చనవిచ్చేవు గాక
(॥॥)
యేచి యీకెను నీశిరసెత్తి చూడరాదా
నీచిత్తము వచ్చితే మన్నించేవుగాక
కాచుకున్నది గొబ్బనఁ గప్పుర మీరాదా
చేచేతఁ జెప్పినట్టు సేసేవుగాక
(॥॥)
నంటున సెలవులను నవ్వరాదా
యింటికివచ్చినప్పు డేలేవుగాక
అంటి ముట్టి యిప్పుడిట్టె యాదరించరాదా
పెంటగా నేకతమునఁ బెనఁగేవుగాక
(॥॥)
కందువల మెచ్చిమెచ్చి కాఁగిలించరాదా
సందడిరతిఁ బాదాలు చాఁచేవుగాక
విందుగా నీకాంతను శ్రీవేంకటేశ కూడితివి
పొంది మోవియ్యరాదా బోదించేవుగాక
(||pallavi||)
paṁtamu dappadu nīgum̐ baḍam̐tidonu
yiṁtaḍilone sanavichchevu gāga
(||||)
yesi yīgĕnu nīśhirasĕtti sūḍarādā
nīsittamu vachchide manniṁchevugāga
kāsugunnadi gŏbbanam̐ gappura mīrādā
sesedam̐ jĕppinaṭṭu sesevugāga
(||||)
naṁṭuna sĕlavulanu navvarādā
yiṁṭigivachchinappu ḍelevugāga
aṁṭi muṭṭi yippuḍiṭṭĕ yādariṁcharādā
pĕṁṭagā negadamunam̐ bĕnam̐gevugāga
(||||)
kaṁduvala mĕchchimĕchchi kām̐giliṁcharādā
saṁdaḍiradim̐ bādālu sām̐sevugāga
viṁdugā nīgāṁtanu śhrīveṁkaḍeśha kūḍidivi
pŏṁdi moviyyarādā bodiṁchevugāga