Pamtamu dappadu neegu pradyumnaa vokka

పంతము దప్పదు నీకు ప్రద్యుమ్నా వొక్క
Language

(॥పల్లవి॥)
పంతము దప్పదు నీకు ప్రద్యుమ్నా వొక్క
బంతిఁ గూడేవు సతుల ప్రద్యుమ్నా

(॥పంతము॥)
బలబలఁ దెల్లవారె ప్రద్యుమ్నా యింకా
బలిమిసేయ వచ్చేవు ప్రద్యుమ్నా
పలచనాయె సిగ్గులు ప్రద్యుమ్నా నీ
పలుసోకులవలెనే ప్రద్యుమ్నా

(॥పంతము॥)
పచ్చలాయ కట్టేవు ప్రద్యుమ్నా
బచ్చెన ప్రియాలు చూపి ప్రద్యుమ్నా
బచ్చుబేరాలసటల ప్రద్యుమ్నా నీ
పచ్చడ మంటించేవు ప్రద్యుమ్నా

(॥పంతము॥)
పదరకు మింక నీవు ప్రద్యుమ్నా మా
బదుకు నీచేతిది ప్రద్యుమ్నా
పదనై శ్రీవేంకటాద్రి ప్రద్యుమ్నా నన్నుఁ
బదిమారులు గూడితి ప్రద్యుమ్నా

(||pallavi||)
paṁtamu dappadu nīgu pradyumnā vŏkka
baṁtim̐ gūḍevu sadula pradyumnā

(||paṁtamu||)
balabalam̐ dĕllavārĕ pradyumnā yiṁkā
balimiseya vachchevu pradyumnā
palasanāyĕ siggulu pradyumnā nī
palusogulavalĕne pradyumnā

(||paṁtamu||)
pachchalāya kaṭṭevu pradyumnā
bachchĕna priyālu sūbi pradyumnā
bachchuberālasaḍala pradyumnā nī
pachchaḍa maṁṭiṁchevu pradyumnā

(||paṁtamu||)
padaragu miṁka nīvu pradyumnā mā
badugu nīsedidi pradyumnā
padanai śhrīveṁkaḍādri pradyumnā nannum̐
badimārulu gūḍidi pradyumnā