Pamtamaaduduvu palumaaru

పంతమాడుదువు పలుమారు
Language

(॥పల్లవి॥)
పంతమాడుదువు పలుమారు
కొంత గొంకితే కొఱతే సుమ్మీ

(॥పంత॥)
కొమ్మ యీఁదురుచు కొలనికి నిను దిగి
రమ్మనుచుఁ దామెరను వేసె
యెమ్మెతోడ నీవిటు దరినుండఁగ
వుమ్మడి నదియే వోటమి సుమ్మీ

(॥పంత॥)
తోపునూఁకుడుగ తొలఁగఁ జూచితే
నీపైఁ బుక్కిటి నీరుమిసె
యీపాట్టినికె యిఁకఁ బిరితీసిన
పైపైనే నగుఁబాటులు సుమ్మీ

(॥పంత॥)
చొరక లోఁగితే సుదతిచే దొబ్బించి
కెరలి నిన్నుఁ గాఁగిటఁ గలసె
యిరవై శ్రీవేంకటేశ యేమరిన
అరయ సతికి కిందగుటవుఁ జుమ్మీ

(||pallavi||)
paṁtamāḍuduvu palumāru
kŏṁta gŏṁkide kŏṟade summī

(||paṁta||)
kŏmma yīm̐durusu kŏlanigi ninu digi
rammanusum̐ dāmĕranu vesĕ
yĕmmĕdoḍa nīviḍu darinuṁḍam̐ga
vummaḍi nadiye voḍami summī

(||paṁta||)
tobunūm̐kuḍuga tŏlam̐gam̐ jūside
nībaim̐ bukkiḍi nīrumisĕ
yībāṭṭinigĕ yim̐kam̐ biridīsina
paibaine nagum̐bāḍulu summī

(||paṁta||)
sŏraga lom̐gide sudadise dŏbbiṁchi
kĕrali ninnum̐ gām̐giḍam̐ galasĕ
yiravai śhrīveṁkaḍeśha yemarina
araya sadigi kiṁdaguḍavum̐ jummī