పంతమాడఁ దడవా పచ్చిదేరీ నని కాక
(॥పల్లవి॥)
పంతమాడఁ దడవా పచ్చిదేరీ నని కాక
కాంతునికిఁ దడవా కైకొనీనని కాక
(॥పంత॥)
కోపగించఁదడవా కొనచూపులకన్నుల
ఆపని తా నెఱిఁగీ ననికాక
రాఁపుగా నాడఁదడవా రంతులవెంగేలఁ దన్ను
వైపుదనబా సెంచుక వచ్చీననికాక
(॥పంత॥)
యెగ్గువట్టఁదడవా యెదుటఁ దనచేఁతకు
నిగ్గులమీఁదటను మానీనవికాక
వెగ్గళించఁదడవా వేగిరించి తనకంటె
సిగ్గుదేరి తాఁ బ్రియముచెప్పీననికాక
(॥పంత॥)
జంకించఁదడవా సమరతులను నేఁడు
కొంకి శ్రీవేంకటేశుఁడు కూడెనవికాక
సుంకుల నవ్వఁదడవా సొరిది సెలవులను
వుంకువగా మేన గోరు వూఁదీననికాక
(||pallavi||)
paṁtamāḍam̐ daḍavā pachchiderī nani kāga
kāṁtunigim̐ daḍavā kaigŏnīnani kāga
(||paṁta||)
kobagiṁcham̐daḍavā kŏnasūbulagannula
ābani tā nĕṟim̐gī nanigāga
rām̐pugā nāḍam̐daḍavā raṁtulavĕṁgelam̐ dannu
vaibudanabā sĕṁchuga vachchīnanigāga
(||paṁta||)
yĕgguvaṭṭam̐daḍavā yĕduḍam̐ danasem̐tagu
niggulamīm̐daḍanu mānīnavigāga
vĕggaḽiṁcham̐daḍavā vegiriṁchi tanagaṁṭĕ
sigguderi tām̐ briyamusĕppīnanigāga
(||paṁta||)
jaṁkiṁcham̐daḍavā samaradulanu nem̐ḍu
kŏṁki śhrīveṁkaḍeśhum̐ḍu kūḍĕnavigāga
suṁkula navvam̐daḍavā sŏridi sĕlavulanu
vuṁkuvagā mena goru vūm̐dīnanigāga