Pamtagaamdavu neegu baamlaidinaa

పంతగాఁడవు నీకు బాఁలైతినా
Language

(॥పల్లవి॥)
పంతగాఁడవు నీకు బాఁలైతినా
యింతినైన నన్ను మెచ్చే విది వలెనా

(॥పంతా॥)
మచ్చికల నీతోను మాటలాడేయట్టివారు
చెచ్చెర నెందరు లేరు సేనాసేన
తచ్చనకు నే నీతో తలవంచుకుండఁగాను
యెచ్చరించి వేఁడుకొనే వింత వలెనా

(॥పంత॥)
జంటల నీవద్ద నుండి సన్నలు సేసేటివారు
యింట నీకెందరు లేరు యింకానింక
గుంటివెట్టి వాసులకు గుట్టుతో నే నుండఁగాను
అంటిమల్లి చేయివట్టే వంతేసి వలెనా

(॥పంత॥)
గక్కన నిన్నేడనైనాఁ గాఁగిలించేయట్టివారు
యిక్కువ నెఁదరు లేరు ఇంతానంతా
మొక్కి శ్రీవేంకటేశుఁడ ముంచి నే నిన్నుఁ గూడితి
చొక్కించి బుజ్జగించేవు సుద్దు లిన్ని వలెనా

(||pallavi||)
paṁtagām̐ḍavu nīgu bām̐laidinā
yiṁtinaina nannu mĕchche vidi valĕnā

(||paṁtā||)
machchigala nīdonu māḍalāḍeyaṭṭivāru
sĕchchĕra nĕṁdaru leru senāsena
tachchanagu ne nīdo talavaṁchuguṁḍam̐gānu
yĕchchariṁchi vem̐ḍugŏne viṁta valĕnā

(||paṁta||)
jaṁṭala nīvadda nuṁḍi sannalu seseḍivāru
yiṁṭa nīgĕṁdaru leru yiṁkāniṁka
guṁṭivĕṭṭi vāsulagu guṭṭudo ne nuṁḍam̐gānu
aṁṭimalli seyivaṭṭe vaṁtesi valĕnā

(||paṁta||)
gakkana ninneḍanainām̐ gām̐giliṁcheyaṭṭivāru
yikkuva nĕm̐daru leru iṁtānaṁtā
mŏkki śhrīveṁkaḍeśhum̐ḍa muṁchi ne ninnum̐ gūḍidi
sŏkkiṁchi bujjagiṁchevu suddu linni valĕnā