పంతగాఁడ విఁక మమ్ముఁ బాయకువయ్యా
(॥పల్లవి॥)
పంతగాఁడ విఁక మమ్ముఁ బాయకువయ్యా
బంతిఁ బెట్టుకొని మమ్ముఁ బాలార్చవయ్యా
(॥పంత॥)
జవ్వనపువారమో సముకపువారమో
యెవ్వర మే మన్నా నెగ్గులెంచకువయ్యా
నవ్వు నవ్వేవారమో ననుపైనవారమో
తవ్విన మోవి రసాల దప్పిదేర్చవయ్యా
(॥పంత॥)
సేవ చేసేవారమో చిత్తములో వారమో
కావరించినా మమ్ముఁ గైకొనవయ్యా
వూవువంటివారమో బోగించేవారమో
వేవేలు మన్ననల వెలయించవయ్యా
(॥పంత॥)
కడుమేనవారమో కప్రపుఁబడివారమో
యెడయక ఇట్టె వీడెలియ్యవయ్యా
కడగి శ్రీవేంకటేశ కలసిన నీవారమో
జడియక యిట్లానే చనవియ్యవయ్యా
(||pallavi||)
paṁtagām̐ḍa vim̐ka mammum̐ bāyaguvayyā
baṁtim̐ bĕṭṭugŏni mammum̐ bālārsavayyā
(||paṁta||)
javvanabuvāramo samugabuvāramo
yĕvvara me mannā nĕggulĕṁchaguvayyā
navvu navvevāramo nanubainavāramo
tavvina movi rasāla dappidersavayyā
(||paṁta||)
seva sesevāramo sittamulo vāramo
kāvariṁchinā mammum̐ gaigŏnavayyā
vūvuvaṁṭivāramo bogiṁchevāramo
vevelu mannanala vĕlayiṁchavayyā
(||paṁta||)
kaḍumenavāramo kaprabum̐baḍivāramo
yĕḍayaga iṭṭĕ vīḍĕliyyavayyā
kaḍagi śhrīveṁkaḍeśha kalasina nīvāramo
jaḍiyaga yiṭlāne sanaviyyavayyā