Pamtagaamda vavuduvu baludoravu navuduvu

పంతగాఁడ వవుదువు బలుదొరవు నవుదువు
Language

(॥పల్లవి॥)
పంతగాఁడ వవుదువు బలుదొరవు నవుదువు
యెంత సేసే వాపె యాస యీడేర్చరాదా

(॥పంత॥)
మక్కువలు చల్లి చల్లి మాటలు నీతో నాడి
చక్కనివాఁడ వనుచు సంతసించీని
యెక్కడ పరాకు నీకు నింతితో నేల జాగులు
యిక్కువతో నాపె యీడేర్చరాదా

(॥పంత॥)
సెలవి నవ్వులు నవ్వి చేతులు నీపై వేసి
అలరిన నేరుపరి వని మెచ్చీని
కలయ వచ్చినవేళఁ గాఁకలకుఁ బనిలేదు
యెలమి నీచెలియాస యీడేర్చరాదా

(॥పంత॥)
కందువ మర్మము లంటి కాఁగిటనే బిగియించి
చెందమ్మిరేకులచూపు సేస వెట్టీని
విందునలె నింతలో శ్రీ వేంకటేశ కూడితిని
యిందరిలో నాపె యాస యీడేర్చరాదా

(||pallavi||)
paṁtagām̐ḍa vavuduvu baludŏravu navuduvu
yĕṁta sese vābĕ yāsa yīḍersarādā

(||paṁta||)
makkuvalu salli salli māḍalu nīdo nāḍi
sakkanivām̐ḍa vanusu saṁtasiṁchīni
yĕkkaḍa parāgu nīgu niṁtido nela jāgulu
yikkuvado nābĕ yīḍersarādā

(||paṁta||)
sĕlavi navvulu navvi sedulu nībai vesi
alarina nerubari vani mĕchchīni
kalaya vachchinaveḽam̐ gām̐kalagum̐ baniledu
yĕlami nīsĕliyāsa yīḍersarādā

(||paṁta||)
kaṁduva marmamu laṁṭi kām̐giḍane bigiyiṁchi
sĕṁdammiregulasūbu sesa vĕṭṭīni
viṁdunalĕ niṁtalo śhrī veṁkaḍeśha kūḍidini
yiṁdarilo nābĕ yāsa yīḍersarādā