Pamtagaamda vauduvu bhalibhali mechchidimi

పంతగాఁడ వౌదువు భళిభళి మెచ్చితిమి
Language

(॥పల్లవి॥)
పంతగాఁడ వౌదువు భళిభళి మెచ్చితిమి
సంతమైతి విన్నిటాను చనవియ్యరాదా

(॥పంత॥)
విన్నవించఁ జెలినంపి వేవేలు కానుకలిచ్చి
సన్నలు సారెకుఁ జేసీ సకియ నీకు
యెన్ని పరాకులు సేసే వెవ్వరితో మాటాడేవు
మన్నించి లోనికి వచ్చి మగువఁ జూడరాదా

(॥పంత॥)
యెదురుగా విచ్చేసి యింటికిఁ దోడుకవచ్చి
పదములు నీమీఁదివి పాడి చూపీని
పెదవి నేల నవ్వేవు ప్రియములెందు దాఁచేవు
కదిసి మోవి యొసగి కైకొనఁగరాదా

(॥పంత॥)
వూడిగాలు నీకు జేసి వొద్దనే కూచుండి
వేడుకతో నిట్టే వీణె వినిపించీని
కూడితివి యికనైనా కొంకక శ్రీవేంకటేశ
మేడెపురతుల నింకా మెప్పించరాదా

(||pallavi||)
paṁtagām̐ḍa vauduvu bhaḽibhaḽi mĕchchidimi
saṁtamaidi vinniḍānu sanaviyyarādā

(||paṁta||)
vinnaviṁcham̐ jĕlinaṁpi vevelu kānugalichchi
sannalu sārĕgum̐ jesī sagiya nīgu
yĕnni parāgulu sese vĕvvarido māḍāḍevu
manniṁchi lonigi vachchi maguvam̐ jūḍarādā

(||paṁta||)
yĕdurugā vichchesi yiṁṭigim̐ doḍugavachchi
padamulu nīmīm̐divi pāḍi sūbīni
pĕdavi nela navvevu priyamulĕṁdu dām̐sevu
kadisi movi yŏsagi kaigŏnam̐garādā

(||paṁta||)
vūḍigālu nīgu jesi vŏddane kūsuṁḍi
veḍugado niṭṭe vīṇĕ vinibiṁchīni
kūḍidivi yiganainā kŏṁkaga śhrīveṁkaḍeśha
meḍĕburadula niṁkā mĕppiṁcharādā