Pamtagaam dappadi nannum baigonanele

పంతగాఁ డప్పటి నన్నుఁ బైకొననేలే
Language

(॥పల్లవి॥)
పంతగాఁ డప్పటి నన్నుఁ బైకొననేలే
పొంత చెమటలలోనె పుంగుడయ్యేఁగాక

(॥పంత॥)
మక్కువలేనివిభుఁడు మాటలాడఁ బనియేమే
వొక్కమనసునఁ దానే వుండుగాక
చిక్కని నవ్వులతోనే సెలవి గొణఁగనేలే
వుక్కవలపుల నేనే వుమ్మగిలేఁ గాక

(॥పంత॥)
మనసురానిపతి మముఁ దిట్టఁబనియేమే
తనరాజసముతోనే దైవారుఁగాక
కనుచూపుఁగోపముతో కాఁకపులకలతోనే
తనరూపు దలపోసి తమకించేఁగాక

(॥పంత॥)
అలిగినరమణుఁడు ఆసపడి కూడనేలే
పిలిచినదాఁకా నుండి పెనఁగుఁగాక
చెలఁగి వేడుకతోడ శ్రీ వేంకటేశుఁడు దానె
కలఁడు నాకు గతెని కళదేరేఁగాక

(||pallavi||)
paṁtagām̐ ḍappaḍi nannum̐ baigŏnanele
pŏṁta sĕmaḍalalonĕ puṁguḍayyem̐gāga

(||paṁta||)
makkuvalenivibhum̐ḍu māḍalāḍam̐ baniyeme
vŏkkamanasunam̐ dāne vuṁḍugāga
sikkani navvuladone sĕlavi gŏṇam̐ganele
vukkavalabula nene vummagilem̐ gāga

(||paṁta||)
manasurānibadi mamum̐ diṭṭam̐baniyeme
tanarājasamudone daivārum̐gāga
kanusūbum̐gobamudo kām̐kabulagaladone
tanarūbu dalabosi tamagiṁchem̐gāga

(||paṁta||)
aliginaramaṇum̐ḍu āsabaḍi kūḍanele
pilisinadām̐kā nuṁḍi pĕnam̐gum̐gāga
sĕlam̐gi veḍugadoḍa śhrī veṁkaḍeśhum̐ḍu dānĕ
kalam̐ḍu nāgu gadĕni kaḽaderem̐gāga