పంతపువా రెల్ల నిటువలె మొక్కేరా
(॥పల్లవి॥)
పంతపువా రెల్ల నిటువలె మొక్కేరా
యింత నీవు నావలె యెనసుండేవా
(॥పంత॥)
యీకడ తమ అంకెల కింతె కాక కాంత లెల్ల
నీ కిచ్చకము లాడేరా నేనె కాక
మేకొని మీఁద మిక్కిలి మేనరికపువా రింతె
నాకొలఁది నీసేవకు నన్నుఁ బోలేరా
(॥పంత॥)
వలచినవారు తమవైపులె చూతురు గాక
నెల వై నిన్ను మెచ్చేరా నేనె కాక
వొలసి యిందరు నీ నవ్వులతోడివా రింతె
నలువంక నీపట్టుకు నన్నుఁ బోలేరా
(॥పంత॥)
పచ్చిగా గూడినవారు పరవశు లింతె కాక
నిచ్చ నిన్నుఁ జొక్కించేరా నేనె కాక
యిచ్చఁ గూడితి శ్రీవెంకటేశ నన్నుఁ బరు లెల్ల
నచ్చుల నీలాగులకు నన్నుఁ బోలేరా
(||pallavi||)
paṁtabuvā rĕlla niḍuvalĕ mŏkkerā
yiṁta nīvu nāvalĕ yĕnasuṁḍevā
(||paṁta||)
yīgaḍa tama aṁkĕla kiṁtĕ kāga kāṁta lĕlla
nī kichchagamu lāḍerā nenĕ kāga
megŏni mīm̐da mikkili menarigabuvā riṁtĕ
nāgŏlam̐di nīsevagu nannum̐ bolerā
(||paṁta||)
valasinavāru tamavaibulĕ sūduru gāga
nĕla vai ninnu mĕchcherā nenĕ kāga
vŏlasi yiṁdaru nī navvuladoḍivā riṁtĕ
naluvaṁka nībaṭṭugu nannum̐ bolerā
(||paṁta||)
pachchigā gūḍinavāru paravaśhu liṁtĕ kāga
nichcha ninnum̐ jŏkkiṁcherā nenĕ kāga
yichcham̐ gūḍidi śhrīvĕṁkaḍeśha nannum̐ baru lĕlla
nachchula nīlāgulagu nannum̐ bolerā