పంతపు సుద్దులు చెప్పే బయకాఁడవు
(॥పల్లవి॥)
పంతపు సుద్దులు చెప్పే బయకాఁడవు
వంతులకు నీవు నట్టే వలవరాదా
(॥॥)
పలచఁగా నవ్వు నవ్వి పలుమారు సిగ్గువడి
వెలఁది మాటలాడీని వినరాదా
వలిపెపయ్యదకొంగు వల్లెవాటు వేసుకొని
చెలరేఁగి మొక్కీని చేకొనరాదా
(॥॥)
కడుమురిపెము చూపి కారపువీడెములిచ్చి
పడఁతి నిలుచున్నది భావించరాదా
కడఁగి తురుము కీలుగంటుగొన బిగియించి
జడియక పెనఁగిని సమ్మతించరాదా
(॥॥)
మచ్చికఁ జన్నులనొత్తి మనసురా మోవి యిచ్చి
నెచ్చెలి గాఁగిలించీ మన్నించరాదా
యిచ్చట శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
తచ్చి తచ్చి సొలసీని దయఁ జూడరాదా
(||pallavi||)
paṁtabu suddulu sĕppe bayagām̐ḍavu
vaṁtulagu nīvu naṭṭe valavarādā
(||||)
palasam̐gā navvu navvi palumāru sigguvaḍi
vĕlam̐di māḍalāḍīni vinarādā
valibĕbayyadagŏṁgu vallĕvāḍu vesugŏni
sĕlarem̐gi mŏkkīni segŏnarādā
(||||)
kaḍumuribĕmu sūbi kārabuvīḍĕmulichchi
paḍam̐ti nilusunnadi bhāviṁcharādā
kaḍam̐gi turumu kīlugaṁṭugŏna bigiyiṁchi
jaḍiyaga pĕnam̐gini sammadiṁcharādā
(||||)
machchigam̐ jannulanŏtti manasurā movi yichchi
nĕchchĕli gām̐giliṁchī manniṁcharādā
yichchaḍa śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
tachchi tachchi sŏlasīni dayam̐ jūḍarādā