Pamtabu gutte saalum badi vaddanu

పంతపు గుట్టే చాలుఁ బతి వద్దను
Language

(॥పల్లవి॥)
పంతపు గుట్టే చాలుఁ బతి వద్దను
చెంత జలధివంటిది చెలి నీ లావణ్యము

(॥పంతపు॥)
ముంచి ముంచి నవ్వకువే మోమెల్లాఁ దెల్లన యీ
వంచనల బంగారువంటిదీ మోము
వంచి వంచి పలుకకు వదనము రుత్తయీ
నించిన తేనెలదీ నీ నినుపువదనము

(॥పంతపు॥)
చిమ్మి చిమ్మి చూడకువే చెక్కు లెల్లా నల్లన యీ
నెమ్మది నద్దాలవంటి నీ చెక్కులు
కమ్మి కమ్మి నడవకు కాఁక వుట్టీ మే నెల్లా
వమ్ములేని లేఁజిగురువంటిది నీ మేను

(॥పంతపు॥)
పొంది పొంది జంకించకు బొమ్మ లట్టే ముడివడీ
సందీఁ గస్తూరిరేఖలజాడబొమ్మలు
యిందులోనే శ్రీవేంకటేశునిఁ గూడితి విట్టే
వందు లేని మాణిక్యమువంటిది నీ గుణము

(||pallavi||)
paṁtabu guṭṭe sālum̐ badi vaddanu
sĕṁta jaladhivaṁṭidi sĕli nī lāvaṇyamu

(||paṁtabu||)
muṁchi muṁchi navvaguve momĕllām̐ dĕllana yī
vaṁchanala baṁgāruvaṁṭidī momu
vaṁchi vaṁchi palugagu vadanamu ruttayī
niṁchina tenĕladī nī ninubuvadanamu

(||paṁtabu||)
simmi simmi sūḍaguve sĕkku lĕllā nallana yī
nĕmmadi naddālavaṁṭi nī sĕkkulu
kammi kammi naḍavagu kām̐ka vuṭṭī me nĕllā
vammuleni lem̐jiguruvaṁṭidi nī menu

(||paṁtabu||)
pŏṁdi pŏṁdi jaṁkiṁchagu bŏmma laṭṭe muḍivaḍī
saṁdīm̐ gastūrirekhalajāḍabŏmmalu
yiṁdulone śhrīveṁkaḍeśhunim̐ gūḍidi viṭṭe
vaṁdu leni māṇikyamuvaṁṭidi nī guṇamu