Pamkajaakshulu solasi paligi nagamgaa

పంకజాక్షులు సొలసి పలికి నగఁగా
Language

(॥పల్లవి॥)
పంకజాక్షులు సొలసి పలికి నగఁగా-
నింకా నారగించు మిట్లనే అయ్యా

(॥పంక॥)
కలవంటకములు పులుఁగములు దుగ్ధాన్నములు
పలుదెరఁగులైన అప్పములగములు
నెలకొన్న నేతులును నిరతంపు చక్కెరలు
గిలుకొట్టుచును నారగించవయ్యా

(॥పంక॥)
పెక్కువగుసైఁ దంపుపిండి వంటల మీఁద
పిక్కటిలు మెఱుఁగు బొడి బెల్లములును
వొక్కటిగఁ గలపుకొని వొలుపుఁబప్పులతోడ
కిక్కిరియ నిటు లారగించవయ్యా

(॥పంక॥)
కడుమధురమైన మీఁగడ పెరుగులను మంచి-
అడియాల పూరుఁగాయల రుచులతో
బడిబడిగ నవకంపుఁ బళ్లెరంబులతోడ
కడునారగించు వేంకటగిరీంద్రా

(||pallavi||)
paṁkajākṣhulu sŏlasi paligi nagam̐gā-
niṁkā nāragiṁchu miṭlane ayyā

(||paṁka||)
kalavaṁṭagamulu pulum̐gamulu dugdhānnamulu
paludĕram̐gulaina appamulagamulu
nĕlagŏnna nedulunu niradaṁpu sakkĕralu
gilugŏṭṭusunu nāragiṁchavayyā

(||paṁka||)
pĕkkuvagusaim̐ daṁpubiṁḍi vaṁṭala mīm̐da
pikkaḍilu mĕṟum̐gu bŏḍi bĕllamulunu
vŏkkaḍigam̐ galabugŏni vŏlubum̐bappuladoḍa
kikkiriya niḍu lāragiṁchavayyā

(||paṁka||)
kaḍumadhuramaina mīm̐gaḍa pĕrugulanu maṁchi-
aḍiyāla pūrum̐gāyala rusulado
baḍibaḍiga navagaṁpum̐ baḽlĕraṁbuladoḍa
kaḍunāragiṁchu veṁkaḍagirīṁdrā