పండి పొల్లవోదె(ది?)పుడు పనులెల్లా ముందరనే
(॥పల్లవి॥)
పండి పొల్లవోదె(ది?)పుడు పనులెల్లా ముందరనే
నిండు నిధానము వలె నిలవే యింకాను
(॥॥)
వొట్టు వెట్టుకొను నేవె వొడఁబరచఁగఁ బోతే
గుట్టుతో నాతనివద్దఁ గూచుండవే
పట్టి పెనఁగఁగఁ బోతే పంతాలు చూపునో యేమో
చుట్టిరికముతోడనే చూడవే యింకాను
(॥॥)
గడి వెట్టుకొనునేమో కదిసి పిలువఁబోతే
విడువక లోననుండి వీడె మియ్యవే
తడవి మాటలాడితే తమకించునో యేమో
చిడుముడి సేవలెల్లాఁ జేయవే యింకాను
(॥॥)
సిగ్గులు వడునో యేమో చెనకులు నించఁబోతే
కగ్గుదీర చన్నులంటఁ గాఁగిలించవే
అగ్గమై శ్రీవేంకటేశుఁ డాదరించి నిన్ను నేలె
వొగ్గి చేతులనే మొక్కి వొనరు మింకాను
(||pallavi||)
paṁḍi pŏllavodĕ(di?)puḍu panulĕllā muṁdarane
niṁḍu nidhānamu valĕ nilave yiṁkānu
(||||)
vŏṭṭu vĕṭṭugŏnu nevĕ vŏḍam̐barasam̐gam̐ bode
guṭṭudo nādanivaddam̐ gūsuṁḍave
paṭṭi pĕnam̐gam̐gam̐ bode paṁtālu sūbuno yemo
suṭṭirigamudoḍane sūḍave yiṁkānu
(||||)
gaḍi vĕṭṭugŏnunemo kadisi piluvam̐bode
viḍuvaga lonanuṁḍi vīḍĕ miyyave
taḍavi māḍalāḍide tamagiṁchuno yemo
siḍumuḍi sevalĕllām̐ jeyave yiṁkānu
(||||)
siggulu vaḍuno yemo sĕnagulu niṁcham̐bode
kaggudīra sannulaṁṭam̐ gām̐giliṁchave
aggamai śhrīveṁkaḍeśhum̐ ḍādariṁchi ninnu nelĕ
vŏggi sedulane mŏkki vŏnaru miṁkānu