Pamdem dechchugonavayyaa paibaine valabalu

పండెఁ దెచ్చుకొనవయ్యా పైపైనె వలపలు
Language

(॥పల్లవి॥)
పండెఁ దెచ్చుకొనవయ్యా పైపైనె వలపలు
బండుల కొలఁదులివె పాయరాని రతులు

(॥పండె॥)
కుప్పలాయ జవ్వనము కోమలి కుచములై
ఇప్పుడే కోరుఁగొందు విందు రావయ్యా
లప్పల కస్తూరి పూఁత లచ్చన వెట్టివున్నది
దెప్పరమై కాఁగిటిగాదెనుఁ బోయవయ్యా

(॥పండె॥)
నాపపంట వచ్చె మరి నలినాక్షి మోవియై
తీపు చవిగొందువు యిందే రావయ్యా
మోపుల కొలఁది మరుముద్రలు వెట్టివున్నవి
కోపుల నీపుక్కిటి కాఁగులఁ బోయవయ్యా

(॥పండె॥)
ముదిత తమ్ములమున ముక్కారు పంట వండె
ఇది చేకొందువు గాని ఇందు రావయ్యా
పొదిగి శ్రీ వేంకటేశ భోగపు నీగురుతబ్బె
చదరాన మేనికణజాన నించవయ్యా

(||pallavi||)
paṁḍĕm̐ dĕchchugŏnavayyā paibainĕ valabalu
baṁḍula kŏlam̐dulivĕ pāyarāni radulu

(||paṁḍĕ||)
kuppalāya javvanamu komali kusamulai
ippuḍe korum̐gŏṁdu viṁdu rāvayyā
lappala kastūri pūm̐ta lachchana vĕṭṭivunnadi
dĕpparamai kām̐giḍigādĕnum̐ boyavayyā

(||paṁḍĕ||)
nābabaṁṭa vachchĕ mari nalinākṣhi moviyai
tību savigŏṁduvu yiṁde rāvayyā
mobula kŏlam̐di marumudralu vĕṭṭivunnavi
kobula nībukkiḍi kām̐gulam̐ boyavayyā

(||paṁḍĕ||)
mudida tammulamuna mukkāru paṁṭa vaṁḍĕ
idi segŏṁduvu gāni iṁdu rāvayyā
pŏdigi śhrī veṁkaḍeśha bhogabu nīgurudabbĕ
sadarāna menigaṇajāna niṁchavayyā