Paluyonulamdu putti bramasidini

పలుయోనులందు పుట్టి బ్రమసితిని
Language

(॥పల్లవి॥)
పలుయోనులందు పుట్టి బ్రమసితిని
అలర నే నేజాతి ననుకొందునయ్యా

(॥పలు॥)
వెనక జన్మముల నా వేడుకైన కాఁపురాల
యెనయు సతులు సుతులెంద రెందరో
మునుకొని యీ జన్మమునఁ గొందరున్నారు
మనసున నెవ్వరి మా వారందునయ్యా

(॥పలు॥)
ఆదికాలముననుండి ఆయా దేహాలు మోచి
ఆదెస యేమేలు నాసొమ్మని వుంటినో
నారించి యిప్పుడు గొన్ని నావి యనుచు నున్నాఁడ
యేది సతమని వుందు యెఱిఁగించవయ్యా

(॥పలు॥)
అన్నిటా నాబాము చూచి అంతలో శ్రీవేంకటేశ
యెన్నరాని విజ్ఞాన మిచ్చితి విట్టె
పన్నిన నా మునుపటి పాట్లెల్లా నెంచుకొంటె
నన్నుఁ జూచి నాలోనే నవ్వు వచ్చీనయా

(||pallavi||)
paluyonulaṁdu puṭṭi bramasidini
alara ne nejādi nanugŏṁdunayyā

(||palu||)
vĕnaga janmamula nā veḍugaina kām̐purāla
yĕnayu sadulu sudulĕṁda rĕṁdaro
munugŏni yī janmamunam̐ gŏṁdarunnāru
manasuna nĕvvari mā vāraṁdunayyā

(||palu||)
ādigālamunanuṁḍi āyā dehālu mosi
ādĕsa yemelu nāsŏmmani vuṁṭino
nāriṁchi yippuḍu gŏnni nāvi yanusu nunnām̐ḍa
yedi sadamani vuṁdu yĕṟim̐giṁchavayyā

(||palu||)
anniḍā nābāmu sūsi aṁtalo śhrīveṁkaḍeśha
yĕnnarāni vijñāna michchidi viṭṭĕ
pannina nā munubaḍi pāṭlĕllā nĕṁchugŏṁṭĕ
nannum̐ jūsi nālone navvu vachchīnayā