Paluvedugaladoda brahmaadulu goluva

పలువేడుకలతోడ బ్రహ్మాదులు గొలువ
Language

(॥పల్లవి॥)
పలువేడుకలతోడ బ్రహ్మాదులు గొలువ
కెలని విందులె ఆరగించీ వీధులను

(॥॥)
పన్నీట మజ్జనమాడి పట్టుదట్టి గట్టుకొని
వున్నతపుతేరెక్కి వుంటవింటను
కన్నెలచన్నులు దాఁక కస్తూరివుంటల వేసి
మిన్నక దేవుఁడు నేఁడు మెరసీ వీథులను

(॥॥)
తట్టుపుళుగు మైం బూసి తగుసొమ్ములు నించుక
దట్టపు సింగారాలతో తమ్మిపువ్వుల
జట్టిగొని యిరుమేలగా సతులపై సేసచల్లి
ఇట్టె పెండ్లికి దేవుఁ డేఁగీ వీథులను

(॥॥)
అలమేలుమంగ నురమందుఁ గట్టుకొని నిల్చి
యెలమితో శ్రీ వేంకటేశ్వరుఁడు
మలసి దేవుళ్లుఁ దాను మారుదేరు లెక్కుకొని
వలపులతో దేవుఁడు వచ్చీ వీథులను

(||pallavi||)
paluveḍugaladoḍa brahmādulu gŏluva
kĕlani viṁdulĕ āragiṁchī vīdhulanu

(||||)
pannīḍa majjanamāḍi paṭṭudaṭṭi gaṭṭugŏni
vunnadabuderĕkki vuṁṭaviṁṭanu
kannĕlasannulu dām̐ka kastūrivuṁṭala vesi
minnaga devum̐ḍu nem̐ḍu mĕrasī vīthulanu

(||||)
taṭṭubuḽugu maiṁ būsi tagusŏmmulu niṁchuga
daṭṭabu siṁgārālado tammibuvvula
jaṭṭigŏni yirumelagā sadulabai sesasalli
iṭṭĕ pĕṁḍligi devum̐ ḍem̐gī vīthulanu

(||||)
alamelumaṁga nuramaṁdum̐ gaṭṭugŏni nilsi
yĕlamido śhrī veṁkaḍeśhvarum̐ḍu
malasi devuḽlum̐ dānu māruderu lĕkkugŏni
valabulado devum̐ḍu vachchī vīthulanu