(॥పల్లవి॥)
పలుమరు నిన్నాడ బలిమేది
అలరి నేఁడు నీ వాడిన దాటా
(॥పలు॥)
తేట తెల్లమిగఁ దెలుపఁగఁ బోయిన
పాటి నీగుణము పసలేదు
కూటమిఁ దొల్లే గురియైతి నీకు
నాటఁగ నీకిఁక నవ్వులు గావా
(॥పలు॥)
వెల్లవిరిగ నిను వెంగెము లాడిన
పల్లదంబు నీపాలిటిది
చెల్లు నీకు నే సేసలు వెట్టితి
యెల్లచోట నీయిచ్చలు గావా
(॥పలు॥)
తెరచిరాజనుచు దిష్టము చూపిన
వురముమీఁద సతి వున్నదిదే
యిరవుగ శ్రీవేంకటేశ కూడితివి
సిరుల నీ చేసినచేఁతలు గావా
(||pallavi||)
palumaru ninnāḍa balimedi
alari nem̐ḍu nī vāḍina dāḍā
(||palu||)
teḍa tĕllamigam̐ dĕlubam̐gam̐ boyina
pāḍi nīguṇamu pasaledu
kūḍamim̐ dŏlle guriyaidi nīgu
nāḍam̐ga nīgim̐ka navvulu gāvā
(||palu||)
vĕllaviriga ninu vĕṁgĕmu lāḍina
palladaṁbu nībāliḍidi
sĕllu nīgu ne sesalu vĕṭṭidi
yĕllasoḍa nīyichchalu gāvā
(||palu||)
tĕrasirājanusu diṣhṭamu sūbina
vuramumīm̐da sadi vunnadide
yiravuga śhrīveṁkaḍeśha kūḍidivi
sirula nī sesinasem̐talu gāvā