పలుమారుఁ బెనఁగక పదవే నీవు
(॥పల్లవి॥)
పలుమారుఁ బెనఁగక పదవే నీవు
నిలుచున్నాఁ డెదుటనే నీ కెంత పగటే
(॥పలు॥)
నెట్టుకొని రమణుఁడు నిన్నే తప్పక చూచీ
పట్టినచలము మాని పదవే నీవు
అట్టె దొర యాఁతడు నిన్నడిగే మాటల కెల్ల
యెట్టైన నుత్తర మియ్య వెంత గుండే నీకు
(॥పలు॥)
చేపట్టి పెనఁగీని చెలువపు నీ విభుఁడు
పైపయిఁ దప్పించుకోక పదవే నీవు
యేపున నాతఁడె నీయింటికి వచ్చి యుండఁగా
కోపము మానవు యేటి కొత్తలే నీవూ
(॥పలు॥)
చింత దీర నాతఁడు చిరునవ్వు నవ్వఁగాను
పంతాలు చెల్ల దింకఁ బదవే నీవూ
అంతలో శ్రీవెంకటేశుఁ డాదరించి నిన్నుఁ గూడె
యెంతటిదానవు నీవు యెదు రేదే నీకు
(||pallavi||)
palumārum̐ bĕnam̐gaga padave nīvu
nilusunnām̐ ḍĕduḍane nī kĕṁta pagaḍe
(||palu||)
nĕṭṭugŏni ramaṇum̐ḍu ninne tappaga sūsī
paṭṭinasalamu māni padave nīvu
aṭṭĕ dŏra yām̐taḍu ninnaḍige māḍala kĕlla
yĕṭṭaina nuttara miyya vĕṁta guṁḍe nīgu
(||palu||)
sebaṭṭi pĕnam̐gīni sĕluvabu nī vibhum̐ḍu
paibayim̐ dappiṁchugoga padave nīvu
yebuna nādam̐ḍĕ nīyiṁṭigi vachchi yuṁḍam̐gā
kobamu mānavu yeḍi kŏttale nīvū
(||palu||)
siṁta dīra nādam̐ḍu sirunavvu navvam̐gānu
paṁtālu sĕlla diṁkam̐ badave nīvū
aṁtalo śhrīvĕṁkaḍeśhum̐ ḍādariṁchi ninnum̐ gūḍĕ
yĕṁtaḍidānavu nīvu yĕdu rede nīgu