పలుమారు వలపుల పైరులు విత్తఁగవలె
(॥పల్లవి॥)
పలుమారు వలపుల పైరులు విత్తఁగవలె
సొలసి తప్పక యిట్టె చూడవయ్య నీవు
(॥పలు॥)
చెలియ తమకములు చెక్కుల చెమటలై
నిలువున జిందీని నీయెదుటను
యోలమి జన్నులసందియేరులై పారీ నిదె
కలసి కౌఁగిట గండి గట్టరాదా నీవు
(॥పలు॥)
పడఁతి సరసములు పై పైనె నవ్వులై
బడినె మేనఁ జెడలువారఁజొచ్చెను
యెడయక కళలనే యిదివో పదనులెక్కె
కడగోరి రేక నచ్చుకట్టురాదా నీవు
(॥పలు॥)
అట్టె అలమేలుమంగ ఆసలే పోదియై
జట్టిగొని పులకలససులొత్తెను
ఇట్టె శ్రీవెంకటేశ నీవెనయఁ దపసువండె
నెట్టున వేడుక గాదె నించరాదా నీవు
(||pallavi||)
palumāru valabula pairulu vittam̐gavalĕ
sŏlasi tappaga yiṭṭĕ sūḍavayya nīvu
(||palu||)
sĕliya tamagamulu sĕkkula sĕmaḍalai
niluvuna jiṁdīni nīyĕduḍanu
yolami jannulasaṁdiyerulai pārī nidĕ
kalasi kaum̐giḍa gaṁḍi gaṭṭarādā nīvu
(||palu||)
paḍam̐ti sarasamulu pai painĕ navvulai
baḍinĕ menam̐ jĕḍaluvāram̐jŏchchĕnu
yĕḍayaga kaḽalane yidivo padanulĕkkĕ
kaḍagori rega nachchugaṭṭurādā nīvu
(||palu||)
aṭṭĕ alamelumaṁga āsale podiyai
jaṭṭigŏni pulagalasasulŏttĕnu
iṭṭĕ śhrīvĕṁkaḍeśha nīvĕnayam̐ dabasuvaṁḍĕ
nĕṭṭuna veḍuga gādĕ niṁcharādā nīvu