Palumaaru maage(ku?) maage baamtibade mimtegaaga

పలుమారు మాకె(కు?) మాకె బాఁతిపడే మింతేకాక
Language

(॥పల్లవి॥)
పలుమారు మాకె(కు?) మాకె బాఁతిపడే మింతేకాక
తలఁకేవే కోరికలు దక్కివున్న విపుడు

(॥పలు॥)
శిరసుపై సేసెవెట్టి చేత విడెమిచ్చి చెలిఁ
దెలవేసి రతికిని దిద్దకొంటివి
తొరలించి యెవ్వరు పొందులు నీతో జేయకున్నా
సిరులతో వెఱచేవా చెతఁజిక్కెవేడక

(॥పలు॥)
పక్కఁబెట్టు కాపెతోడ పచ్చిమాటలెల్లా నాడి
చెక్కునొక్కి కైవశము సేసుకొంటివి
తక్కించి యెవ్వతె నీకుఁ దరితీపు సేసినాను
కక్కదలేవా కు కడుఁ దనివొందెను

(॥పలు॥)
మంచముపై నిడుకొని మనసు రంజిల్లఁ జేసి
పెంచి యలమేలుమంగఁ బెండ్లాడితివి
యెంచి నన్నుఁ గూడితివి యిప్పుడే శ్రీ వేంకటేశ
పొంచేవా నీవలపులు కొల్లలాయ నెదుట

(||pallavi||)
palumāru māgĕ(ku?) māgĕ bām̐tibaḍe miṁtegāga
talam̐keve korigalu dakkivunna vibuḍu

(||palu||)
śhirasubai sesĕvĕṭṭi seda viḍĕmichchi sĕlim̐
dĕlavesi radigini diddagŏṁṭivi
tŏraliṁchi yĕvvaru pŏṁdulu nīdo jeyagunnā
sirulado vĕṟasevā sĕdam̐jikkĕveḍaga

(||palu||)
pakkam̐bĕṭṭu kābĕdoḍa pachchimāḍalĕllā nāḍi
sĕkkunŏkki kaivaśhamu sesugŏṁṭivi
takkiṁchi yĕvvadĕ nīgum̐ daridību sesinānu
kakkadalevā ku kaḍum̐ danivŏṁdĕnu

(||palu||)
maṁchamubai niḍugŏni manasu raṁjillam̐ jesi
pĕṁchi yalamelumaṁgam̐ bĕṁḍlāḍidivi
yĕṁchi nannum̐ gūḍidivi yippuḍe śhrī veṁkaḍeśha
pŏṁchevā nīvalabulu kŏllalāya nĕduḍa