Palumaada limka nela baduganeeve

పలుమాట లిఁక నేల బతుకనీవే
Language

(॥పల్లవి॥)
పలుమాట లిఁక నేల బతుకనీవే
బలిమికాఁ డాయఁ దాను బతుకనీవే

(॥పలు॥)
వొట్టువెట్టుకుండ నన్ను వుద్దండము సేసి కూడె
పట్టినపంతముఁ దాను బతుకనీవే
తిట్టితేను తనుఁ జూచి దీవించ నోపను
పట్ట్టపుచెలులుఁ దాను బతుకనీవే

(॥పలు॥)
కోపము దీరకతొల్లె కుసిగుంపు సేసి కూడె
పాపపణ్యము తనది బతుకనీవే
పోపో మ్మనఁగాలేను పూఁచి నే రమ్మనలేను
పై పూఁతవలపుతో బతుకనీవే

(॥పలు॥)
వొల్ల వొల్ల ననఁగానే వొడివట్టి తీసి కూడె
పల్లదముతోఁ దానే బతుక నీవే
యెల్లగా శ్రీవేంకటేశు నిఁక నేమీ ననలేను
పల్లవించఁ జేసి నన్ను బతుకనీవే

(||pallavi||)
palumāḍa lim̐ka nela baduganīve
balimigām̐ ḍāyam̐ dānu baduganīve

(||palu||)
vŏṭṭuvĕṭṭuguṁḍa nannu vuddaṁḍamu sesi kūḍĕ
paṭṭinabaṁtamum̐ dānu baduganīve
tiṭṭidenu tanum̐ jūsi dīviṁcha nobanu
paṭṭṭabusĕlulum̐ dānu baduganīve

(||palu||)
kobamu dīragadŏllĕ kusiguṁpu sesi kūḍĕ
pābabaṇyamu tanadi baduganīve
pobo mmanam̐gālenu pūm̐si ne rammanalenu
pai pūm̐tavalabudo baduganīve

(||palu||)
vŏlla vŏlla nanam̐gāne vŏḍivaṭṭi tīsi kūḍĕ
palladamudom̐ dāne baduga nīve
yĕllagā śhrīveṁkaḍeśhu nim̐ka nemī nanalenu
pallaviṁcham̐ jesi nannu baduganīve